దిండ్లనూ ఉతకొచ్చు!
close
Published : 12/06/2021 01:07 IST

దిండ్లనూ ఉతకొచ్చు!

దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే...

దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి. వీలైతే వాటిని ప్రతి పదిహేను రోజులకోసారి నాలుగైదు గంటల పాటు ఎండతగిలేలా ఉంచాలి.
వాషింగ్‌మెషీన్‌లో వీటిని వేస్తే లార్జ్‌లోడ్‌, హీట్‌ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇందులో ముందుగా అరకప్పు బట్టల సోడా, లిక్విడ్‌ వేసుకోవాలి. ఇప్పుడు రెండు దిండ్లను మెషిన్‌లో అటొకటి ఇటొకటి పెడితే వాటి ఆకృతి చెడిపోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్‌ కండిషనర్‌తో పాటు రెండు చుక్కల లావెండర్‌నూనె వేస్తే అవి ఆరాక సువాసన వెదజల్లుతాయి.
చేత్తో ఉతకాలనుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్లల్లో కాస్త హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వెనిగర్‌, సర్ఫ్‌ వేసి దిండ్లను ఓ పదినిమిషాలైనా నాననివ్వాలి. ఆపై మృదువుగా చేత్తో రుద్దితే... మురికీ, మరకలూ వదిలిపోతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని