వ్యథార్థ జీవన చిత్రణకు అంతర్జాతీయ పురస్కారాలు
close
Published : 11/08/2021 01:46 IST

వ్యథార్థ జీవన చిత్రణకు అంతర్జాతీయ పురస్కారాలు

రోడ్ల మీద ఎక్కడైనా చెత్త కనిపిస్తే మున్సిపాల్టీ వాళ్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదు అని తిట్టుకుంటాం. కానీ వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటే మాత్రం అక్కడ శ్రమించిన పారిశుధ్య కార్మికులను గుర్తుకు తెచ్చుకోం. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వారు చేసే శ్రమకు గుర్తింపు ఉండదు. అందులోనూ మహిళా కార్మికుల సమస్యలు మరీ ఎక్కువ. సరిగ్గా ఈ అంశాన్నే ఎంచుకుని ఒకమ్మాయి లఘుచిత్రాన్ని తీసింది. అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది... తనెవరో, ఆ చిత్రం ఏంటో చూడండి...
పాతికేళ్ల స్నేహ మేనన్‌ది బెంగళూరు. తను డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ సారి ఓ పత్రికా కథనం తనని బాగా కదిలించింది. కుటుంబ పోషణ కోసమే ఎక్కువ శాతం మంది మహిళలు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారన్నది దాని సారాంశం. దాంతో వారి కష్టాలు, కడగళ్లను లఘుచిత్రంగా తీసి ప్రపంచానికి చూపాలనుకుంది. వాళ్లను దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టింది. దీని కోసం చదువును ఆపేసింది. ఎండనకా, దుమ్మనకా నగరాన్ని శుభ్రపరచడంలో నిమగ్నమయ్యే వీరికి సొంత ఆరోగ్యం గురించి పట్టింపు, పాటించాల్సిన ఆరోగ్య నియమాల గురించి అవగాహన లేకపోవడం చూసి బాధ పడింది. కుటుంబానికి చేయూత, పిల్లల చదువులు... ఇవే వారి లక్ష్యాలు. కొన్ని నెలల పాటు స్నేహ కూడా వారి వెంటే తిరిగింది. రోజంతా ఆ మహిళా కార్మికుల విధులను దగ్గరగా పరిశీలించింది. వారి ఇబ్బందులను తెలుసుకుంది. 

తెరపైకి తేవాలనుకున్నా...

చాలామందికి వీరి గురించి తెలీదు, అందుకే తెర వెనుక ఉన్న వీరి జీవితం గురించి ఎన్నో విషయాలను లఘు చిత్రంగా తెరపైకి తీసుకు రావాలనుకున్నా అంటుంది స్నేహామీనన్‌. ‘వాళ్లతో మాట్లాడినప్పుడు.. దేని గురించి అడిగినా ‘దేవుడున్నాడు... మా బాధలన్నీ ఆయనే చూసుకుంటాడు’ అంటూ సమాధానం ఇచ్చేవారు. అదే నా చిత్రం ‘ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’. నగరం నిద్రలో ఉన్నప్పుడే వీరు పని మొదలు పెడతారు. కాలాలతో సంబంధం లేకుండా వర్షం, ఎండ వంటివి లెక్కచేయకుండా నిర్విరామంగా పని చేస్తారు.  నెలసరి వంటి సమయాల్లో కూడా విధులు నిర్వర్తించాల్సిందే. ఇలా వారి కష్టంలో ప్రతి క్షణాన్నీ డాక్యుమెంటరీలో పొందుపరిచా. దీని ద్వారా వారి గురించి అందరికీ అవగాహన కలగాలి. వారిని, వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కొన్నిచోట్ల వీరి పరిసరాల్లోకి రావడానికి కూడా చాలామంది ఇష్టపడక పోవడాన్ని చూశా. మరికొన్ని ప్రాంతాల్లో అంటరాని వాళ్లుగా చూసేవారు. నిజానికి వీళ్లు ఉన్నతమైన విధులు నిర్వర్తిస్తున్నారు. మనందరి ఆరోగ్యాల్నీ పరిరక్షిస్తున్నారు. అటువంటి వారి గురించి నా డాక్యుమెంటరీ ద్వారా ఒక్క నిమిషమైనా అందరినీ ఆలోచింప చేయాలనేదే నా ప్రయత్నం’ అని చెబుతోంది స్నేహా మీనన్‌. గత జూన్‌లో పూర్తిచేసిన ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. 23 నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి అర్హత పొందింది. పలు అవార్డులనూ అందుకుంది.ఈ ఏడాది వురువట్టి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుని, ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌’ అవార్డును దక్కించుకుంది. ఇటీవల టొరంటో, ఠాగూర్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శనకు ఎంపికైంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని