అయినా.. కోటి గెల్చుకుంది
close
Published : 02/09/2021 01:08 IST

అయినా.. కోటి గెల్చుకుంది

‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టీవీ కార్యక్రమాల్లో ఒకటి. దీని 13వ సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. మొదలైiన వారం రోజులకే ఒకామె కోటి రూపాయలు గెల్చుకుంది. ‘గతంలోనూ చాలామంది గెల్చుకున్నారు. కొత్తేముంది?’ అనుకుంటున్నారా! ఆమెకు కళ్లు సరిగా కనిపించవు మరి!

హిమానీ బుందేలా ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారుగా నిల్చింది. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి విజయ్‌ సింహ్‌ చిరు వ్యాపారి. తల్లి సరోజ్‌ గృహిణి. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్‌ ఆమెను ఢీకొంది. కాళ్లూ చేతులకు బాగా దెబ్బలు తగిలాయి. ఎముకలేమీ విరగలేదు. దీంతో డాక్టర్‌ దెబ్బలకు కట్లు కట్టి పంపించేశారు. కొన్నిరోజులకు ఆమె తన కళ్లు బాగా మసకబారుతుండటం గమనించింది. హాస్పిటల్‌కి వెళితే ‘రెటీనా పక్కకు తొలిగింది, రెండు రోజుల్లో ఆపరేషన్‌ చేయకపోతే చూపు పోయే ప్రమాదం ఉంద’న్నారు. ఎనిమిది నెలల్లో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మూడో సర్జరీ వరకూ రంగులు సహా స్పష్టంగా చూడగలిగేది. నాలుగో ఆపరేషన్‌ నుంచి పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పటికీ వెలుతురు, చీకటి మినహా ఏమీ గుర్తుపట్టలేదు.

కానీ.. తనేమీ కుంగిపోలేదు. లెక్కలంటే ఇష్టం. వాటినే సాధన చేసేది. చిన్నతరగతుల పిల్లలకు మెంటల్‌ మ్యాథ్స్‌ బోధిస్తోంది. ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా చేస్తోంది. కేబీసీ మీద ఉన్న ఆసక్తితో ప్రయత్నించింది. ‘వెళ్లాలన్న తపన ఉంది. కానీ.. మిగతా వాళ్లు నన్నెలా చూస్తారోనన్న భయం ఉండేది. జాలి చూపిస్తారా, తమతో సమానంగా చూస్తారా అన్న సందేహముండేది. పైగా వాళ్లు కంప్యూటర్స్‌ వాడటంలో నాకంటే వేగంగా, ముందుగా ఉంటారు. పోటీ పడగలనా అనుకున్నా. కానీ అందరూ నాతో గౌరవంగా వ్యవహరించారు. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని వివరించింది 25 ఏళ్ల హిమానీ. అమితాబ్‌ బచ్చన్‌ ప్రశ్నలు చదువుతుంటే వాటిని విని, ఆప్షన్లు గుర్తుంచుకుని సమాధానాలిచ్చింది. కోటి రూపాయలు గెల్చుకుంది. ఏడు కోట్ల ప్రశ్ననీ ప్రయత్నించింది కానీ, చెప్పలేక వెనుదిరిగింది. ఆ బహుమతి మొత్తంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వికలాంగులకు సాయపడేందుకు ఓ సంస్థని ప్రారంభిస్తానంటోంది. తనను ప్రోత్సహించిన కుటుంబానికీ కొంత ఇస్తానంటోంది. ఆద్యంతం చిరునవ్వుతో, ఉత్సాహంగా ఉన్న ఆమెను అమితాబ్‌ ఓ ప్రశ్న అడిగారు. ‘కళ్లు కనిపించకపోయినా ఇంత ఉత్సాహంగా ఎలా?’ అని. ‘జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటే ఆనందంతోపాటు విజయాలూ దక్కుతాయి. అలా ఉండగలిగితే చాలు’ అంటోంది హిమానీ. బాగా చెప్పింది కదూ!



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని