మేకప్‌ కాదిది అంతకుమించి...
close
Published : 18/09/2021 01:41 IST

మేకప్‌ కాదిది అంతకుమించి...

బాంబు, యాసిడ్‌ దాడుల బాధితుల రూపాలు.. కొత్త రకం జీవులు.. మూగజీవుల ముఖాల్లో భావాలను పలికించడం.. ఇలాంటివన్నింటినీ మేకప్‌, గ్రాఫిక్‌లద్వారా అన్నిసార్లూ సాధ్యం కాదు. దీనికి సహజ పరిష్కారమే ప్రోస్థటిక్స్‌. దీనికీ విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అంత అవసరం లేదు... మనమే చేసుకోగలం అని నిరూపిస్తోంది జుబీ జోహల్‌. ప్రోస్థటిక్స్‌ రంగానికి కొత్త హంగులద్దుతున్న ఆమె గురించి తెలుసుకుందామా!

జుబీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌లో చదివింది. ఈమెది చెన్నై. వీళ్ల కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా జుబీ, తన స్నేహితుడు రాజీవ్‌ సుబ్బా ఒక డిజైన్‌ సంస్థకు ఎంపికయ్యారు. ఈమె గ్రాఫిక్స్‌ డిజైనర్‌. అతనేమో శిల్పాకృతుల నిపుణుడు. ఇద్దరికీ సెరామిక్‌, గ్లాస్‌ శిల్పాల చేతలో నైపుణ్యం ఉంది. కానీ అక్కడ ఓ మ్యూజియం కోసం సిలికాన్‌తో విగ్రహాలను రూపొందించాల్సి వచ్చింది. అప్పుడే ప్రోస్థటిక్స్‌ గురించి అధ్యయనం చేసి ఆ పద్ధతిలో 19 విగ్రహాలను తయారు చేశారు. ప్రోస్థటిక్స్‌ అంటే... రకరకాల పదార్థాలతో కృత్రిమ అవయవాలు, బొమ్మలు, ఇలా వేటినైనా తయారు చేస్తారు. దీని సహాయంతో విచిత్ర ఆకారాల్లో మనుషులను, జీవులను రూపొందిస్తారు. తమ అనుభవాన్ని సినిమా రంగంలో ఉపయోగిస్తే బాగుంటుందని అనుకున్నారు. ఓ స్నేహితుడి ద్వారా ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ని కలిశారు. వీళ్ల పనితనం చూసి అనురాగ్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌’లో అవకాశమిచ్చాడు.

ఈ సినిమాలో యాక్సిడెంట్‌, రిచాచద్దా ప్రెగ్నెన్సీ మొదలైన ప్రోస్థటిక్‌ మేకప్‌ అంతా జుబీనే చూసుకుంది. కానీ రెండేళ్లయినా ఆ సినిమా విడుదలవ్వలేదు. అప్పుడే ఈ సినిమా వీడియోతో వేరే ప్రొడక్షన్లకు ప్రయత్నించమని అనురాగ్‌ సలహా ఇచ్చాడు. అలా రాజ్‌ 3, ఫైండింగ్‌ ఫ్యానీ, బద్‌లాపుర్‌ మొదలైన వాటిల్లో అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో పుణె, భోపాల్‌, నోయిడాల్లోని మ్యూజియమ్‌లకూ పనిచేసింది. జుబీ, రాజీవ్‌ కలిసి ‘డర్టీ హ్యాండ్స్‌’ స్టూడియోనూ ఏర్పాటు చేశారు. దానికి జుబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఈమె గురించి తెలుసుకుని ‘ఎల్‌ఏ’ అనే విదేశీ సంస్థ తనను సంప్రదించింది. ఈ సంస్థ షారూఖ్‌, రిషీకపూర్‌ వంటి ప్రముఖుల సినిమాలకు ప్రోస్థటిక్స్‌ అందించింది. మంచి అవకాశమని ‘ఎల్‌ఏ’తో కలిసి పనిచేసింది. తర్వాత్తర్వాత దేశంలో చాలా వరకూ సినిమాలకు ఈమెపై ఆధారపడటం మొదలైంది. ఇప్పటివరకూ వివిధ భాషల్లో 36కుపైగా సినిమాలకు పనిచేసింది.

‘దీనిలో ఒకసారి నేర్చుకుని ప్రతి పనిలోనూ దాన్నే కొనసాగిస్తామంటే కుదరదు. ఒక్కో పాత్రకీ చాలా హోంవర్క్‌ చేయాలి. రబ్తాలో రాజ్‌కుమార్‌ రావ్‌ను 300 ఏళ్ల వ్యక్తిగా చూపించాల్సి వచ్చింది. ముసలి వ్యక్తి అంటే పుర్రె ఒకేలా ఉన్నా చర్మం సాగిపోయి ఉంటుంది. అది ముడతలు పడే తీరు మొదలైనవన్నీ ఫొటోషాప్‌ చేసి చూసుకునే దాన్ని. తర్వాత ప్రోస్థటిక్‌ రూపాన్ని చేసేదాన్ని. అప్పటి పరిస్థితులు, వస్తువులు... ఇలా ఎన్నింటినో తెలుసుకోవాలి. ఒక్కోసారి సెట్‌లో అప్పటికప్పుడు మార్పులు చేయాలి’ అని వివరిస్తోంది జుబీ.

‘దీనికి మెటీరియల్‌ దేశంలో దొరకదు. విదేశాల నుంచి ఆర్డర్‌ ఇస్తే నెలకు చేతికి అందుతుంది. దీనికి మండే గుణం ఉంటుంది. కాబట్టి, ఎన్నో అనుమతులు తీసుకోవాలి, కస్టమ్స్‌ చెల్లించాలి. ఒకేసారి తెప్పిద్దామన్నా వాటి జీవిత కాలం తక్కువ. దీంతో చాలా మంది ఆసక్తి, నైపుణ్యాలున్నా వెనకడుగు వేస్తున్నారు. ఇదో రకం మేకప్‌ అనుకుంటారు. కానీ కాదు.. అని వివరిస్తుంటా’ అంటోంది. తన పరిజ్ఞానాన్ని విద్యార్థులతోనూ పంచుకుంటోంది. డిజైనింగ్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చర్లు ఇస్తోంది. సిలికాన్‌తో దుస్తులు, బ్యాగులు, మాస్క్‌లు ఇతర ఆక్సెసరీలను తయారు చేస్తోంది. 29 ఏళ్ల జుబీ ‘స్టూడియో అవతార్‌’ పేరిట అహ్మదాబాద్‌లో ఓ సంస్థనూ ప్రారంభించింది. ఇదో డెకరేషన్‌ సంస్థ. మోల్టెన్‌ గ్లాస్‌తో డెకరేషన్‌, గృహాలంకరణ వస్తువులను తయారు చేసి పార్టీ థీమ్‌లను రూపొందిస్తారు. ‘నేటి యువతరంలో చాలా ప్రతిభ ఉంది. వాళ్లని ప్రోత్సహిస్తే హాలీవుడ్‌ స్థాయికి చేరగలుగుతారు. కాస్త అవగాహన పెంచాలంతే. అదే చేస్తున్నా’ అంటోంది జుబీ.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని