ఆ నేలలో శాంతి నింపాలని..
close
Updated : 06/07/2021 04:40 IST

ఆ నేలలో శాంతి నింపాలని..

ఏళ్లుగా యుద్ధం.. అశాంతితో విసుగెత్తిన ఆ నేలలో శాంతిని నెలకొల్పి, మనుషుల్లో నమ్మకాన్ని నిర్మించడం అంత తేలిక వ్యవహారం కాదు. నిత్యం తుపాకుల పహారాలో ఉండే దక్షిణసుడాన్‌లో అడుగుపెట్టి ఏడాదిపాటు ధైర్యంగా పోలీసు విధులు నిర్వహించారు పల్లె పద్మ. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో భాగంగా దక్షిణ సుడాన్‌ నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఆమెను వసుంధర పలకరించింది...

‘బాగా చదువుకుని మంచి ఉద్యోగం దొరికితే చాలు’... మొదట్లో నా ఆలోచనలు ఇలానే ఉండేవి. అందుకే బీఈడీ  చేశాను. మాది కరీంనగర్‌. కాలేజీలో ఎన్‌సీసీలో చేరా. ఆ యూనిఫాం వేసుకున్నప్పుడు మనసంతా తెలియని సంతోషం. ఇంతలో నోటిఫికేషన్‌ వచ్చింది. పరీక్షలు రాసి పోలీసు ఫోర్స్‌లో చేరడానికి అర్హత సాధించాను. శిక్షణ పూర్తయ్యి.. 2005లో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరా. ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లైంది. మాకిద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు.

ఈసారి నేనొక్కదాన్నే...

ఐక్యరాజ్యసమితి నిర్వహించే ‘పీస్‌కీపింగ్‌ మిషన్‌’ గురించి మా సీనియర్లు మాట్లాడుతుంటే విన్నా. ఆసక్తిగా అనిపించింది. ప్రపంచదేశాల్లో శాంతిని పరిరక్షించడం ఈ మిషన్‌ లక్ష్యం. కెరీర్‌లో ఒక్కసారైనా అటువంటి విధులు నిర్వర్తించాలని అనిపించింది. దీనికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. మనలో సేవాభావం, ప్రజారక్షణ పట్ల మనకున్న బాధ్యత వంటివీ చూస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఐరాస నేషన్స్‌ సెలక్షన్‌ అసిస్టెంట్స్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ టీం(శాట్‌) పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించా. ఇందులో రిపోర్ట్‌ రైటింగ్‌, డ్రైవింగ్‌, ఫైరింగ్‌ నైపుణ్యాలని పరీక్షిస్తారు. తర్వాత దిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్లి ఎంపికయ్యా. ఎంపికైన 160 మందిని రెండేళ్లపాటు పలు దేశాలకు పంపిస్తారు. అలా గతేడాది ఫిబ్రవరిలో నాకు సౌత్‌ సుడాన్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా 11 మంది ఈ పీస్‌మిషన్‌కు ఎంపికైతే అందులో అయిదుగురం మహిళలం. తెలంగాణా నుంచి ఈ ఏడాది ఎంపికైన వాళ్లలో నేనొక్కదాన్నే మహిళను కావడం గర్వంగా అనిపించింది.

సౌత్‌ సుడాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం ఆరేళ్లకుపైగా యుద్ధం చేసింది. యుద్ధం ముగిసేనాటికి అక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతో మంది సొంతగడ్డను వదిలి పునరావాసకేంద్రాల్లో ఏళ్లుగా మగ్గిపోయారు. అక్కడ తిరిగి పూర్వపు పరిస్థితులు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి కృషి చేస్తోంది. మగవారంతా యుద్ధ భూమిలో ఉంటే వాళ్లు తిరిగి వచ్చేంతవరకూ ఆడవాళ్లే ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. అయితే ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్కడి స్త్రీలు ధైర్యస్తులు. వాళ్ల మనోబలం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అక్కడి ప్రభుత్వం వివిధ రంగాల్లో స్త్రీలకు అవకాశం వచ్చి మహిళలను ప్రోత్సహించాలని చూస్తోంది.

ఇంకా యుద్ధ ఛాయలు పూర్తిగా పోని ఆ దేశంలో విధి నిర్వహణ అంత తేలిక కాదు. అక్కడి భాషతో నాకే ఇబ్బందీ కాలేదు. దుబాసీల సాయం ఉండేది. ఐరాస పోలీసులు, స్థానిక పోలీసు విభాగంతో కలిసి అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ, నేర పరిశోధన, ఇంటరాగేషన్స్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌ వంటి అంశాల్లో సహకరించాం. పలు విషయాల్లో స్థానిక పోలీసులకు అవగాహన కలిగించా. అక్కడి పోలీసుస్టేషన్లకు ఎన్నో రకాల కేసులు వచ్చేవి. వాటిలో దొంగతనం నుంచి అత్యాచారాలు, హత్యలు, వర్గవిభేదాలు, కొట్లాటలు వంటివన్నీ ఉండేవి. వాటికి సంబంధించిన ఇంటరాగేషన్‌, కేసు ఫైల్‌ చేసి అధికారులకు అందించడం వంటి బాధ్యతలు నిర్వర్తించాను. ఇతర పోలీసులతో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహించేదాన్ని. దీంతోపాటు అక్కడి ఎన్జీవోలతోనూ కలిసి పనిచేశాం.

కష్టమే అయినా.... ఇష్టంగా

అక్కడ వంట నుంచి ఇంటి పని వరకూ ఎవరికి వారే చేసుకోవాలి. కుటుంబానికి దూరంగా ఉండటం ఒక్కోసారి చాలా కష్టంగా అనిపించేది. కానీ... మనసుకు నచ్చిన పని కావడంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. వివిధ ప్రాంతాల నుంచి సేవలందించడానికి వచ్చిన మహిళా అధికారులతో కలిసి పనిచేయడంతో తెలియని చాలా విషయాలను నేర్చుకున్నా. 13 నెలల తర్వాత అక్కడి నుంచి వచ్చా. నా కుటుంబ సహకారం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఈ అనుభవం జీవితాంతం గుర్తుంటుంది. ప్రస్తుతం బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో హౌస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.

మంచిమాట

దృఢచిత్తం గల మహిళ ఎంత క్లిష్టమైన బాధ్యతనయినా ధైర్యంగా చేపట్టి, సమర్థంగా పూర్తిచేస్తుంది.

- మార్జి పియర్సీ, రచయిత్రి

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని