పట్టు లాంటి జుట్టు కోసం.. రాత్రి పూట ఇలా! - night time hair routine to repair your damaged hair in telugu
close
Published : 22/08/2021 09:11 IST

పట్టు లాంటి జుట్టు కోసం.. రాత్రి పూట ఇలా!

వర్షాకాలంలో హ్యుమిడిటీ వల్ల జుట్టు పొడిబారిపోయి గడ్డిలా మారడం మనలో చాలామందికి అనుభవమే! అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అత్యవసరం. మరి, అందుకు చాలామందికి పగటి పూట సమయం దొరక్కపోవచ్చు. అలాంటివారు రాత్రి పూట పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా జుట్టుకు తేమనందించడంతో పాటు వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టచ్చని చెబుతున్నారు.

జుట్టుకో మాస్క్!

జుట్టు ఆరోగ్యానికి వివిధ రకాల హెయిర్‌మాస్క్‌లు/ప్యాక్‌లు ప్రయత్నిస్తుంటాం. అయితే తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే.. అది గుమ్మడికాయతో తయారుచేసిన హెయిర్‌ మాస్క్‌తోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్ని తీసుకొని.. అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. పడుకునే ముందు షవర్‌ క్యాప్‌ పెట్టుకొని.. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే గడ్డిలా మారిన జుట్టు కాస్తా పట్టులా తయారవుతుంది. మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

ఈ నూనెతో మర్దన!

జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే ముందు కుదుళ్లు దృఢంగా ఉండాలి. అందుకోసం అప్పుడప్పుడూ కుదుళ్లను మృదువుగా మర్దన చేయడం అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రెండు టీస్పూన్ల ఆలివ్‌ నూనెలో, రెండు గుడ్లలోని పచ్చసొనలు, కొద్దిగా కలబంద గుజ్జు వేసి మృదువైన మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టించి పావుగంట పాటు మర్దన చేయాలి. పడుకునే ముందు జుట్టును పైకి ముడేసుకొని షవర్‌ క్యాప్‌ పెట్టేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు తేమనందించి.. మృదువుగా మార్చుతుంది.

జుట్టు రాలుతోందా?

జుట్టు విపరీతంగా రాలిపోవడం ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. ఇందుకు కారణమేదైనా రాత్రి పడుకునే ముందు ఈ చిట్కా పాటించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కప్పు ఆముదం నూనెలో టీస్పూన్‌ రోజ్‌మేరీ నూనె వేసి బాగా కలపాలి. ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాస్‌ జార్‌లో భద్రపరచుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించచ్చు.. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకూ ఈ నూనె తోడ్పడుతుంది.

కొబ్బరి పాలతో సిల్కీగా!

గరుకుగా, గడ్డిలా మారిన జుట్టును రిపేర్‌ చేయడానికి కండిషనర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా మారడం గమనించచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

* కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మర్దన చేసి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

* జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు కొంతమంది. తద్వారా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకొస్తుంది.

వీటితో పాటు తీసుకునే ఆహారంలో ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’.. వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే! మరి, జుట్టు ఆరోగ్యం కోసం రాత్రి పడుకునే ముందు మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి!


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని