కరోనా నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతోందా? అయితే ఇలా చేయండి! - nutritionist pooja makhija listed the nutrients that can help you deal with hair fall after covid re
close
Updated : 18/06/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతోందా? అయితే ఇలా చేయండి!

పూర్ణిమ ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది. అయితే ఈ మధ్య తనకు విపరీతంగా జుట్టు రాలిపోవడం గమనించింది. వెంటనే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి తగిన సలహాలు తీసుకుంది.
మౌనిమదీ ఇదే సమస్య! కరోనా తగ్గిన తర్వాత కొంతమందిలో జుట్టు రాలడం సహజమే అని తెలుసుకున్న ఆమె.. అటు వైద్యులు సూచించిన మందులు వాడుతూనే.. ఇటు ఇంటి చిట్కాలనూ ప్రయత్నిస్తోంది.
హమ్మయ్య.. ఎలాగోలా కరోనాను జయించామనుకునే లోపే చాలామంది బాధితుల్లో వివిధ రకాల సమస్యలు బయటపడుతూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిల్లో జుట్టు రాలిపోవడంతో వారిలో కంగారు మరింత పెరిగిందని చెప్పాలి. అయితే ఈ సమస్యకు మనం తీసుకునే పోషకాహారంతోనే చెక్‌ పెట్టచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. ఇందులో భాగంగా పలు విటమిన్లు, సప్లిమెంట్లు రోజూ తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి త్వరగా బయటపడచ్చంటూ ఆ చిట్కాలను ఓ వీడియో రూపంలో పంచుకున్నారామె.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అలసట, నీరసం, ఫ్లూ లక్షణాలు.. వంటివి కొంతమందిలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే! అలాగే కొవిడ్‌ను జయించిన కొందరు మహిళల్లో జుట్టు రాలే సమస్య తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వల్ల వారిలో కలిగిన భయాందోళనలు, ఒత్తిళ్లే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఏదైనా ఒత్తిడితో కూడిన అనుభవం (ఉదాహరణకు.. తీవ్ర జ్వరం, మేజర్‌ సర్జరీ, మానసిక ఆందోళనలు.. మొదలైనవి) నుంచి బయటపడిన కొన్ని నెలల తర్వాత ఇలా జుట్టు రాలిపోవడం సహజమేనని, ఇది కూడా తాత్కాలికమే అని చెబుతున్నారు.

ఇవి రోజూ తీసుకోవాలి!
అయితే ఈ సమస్యకు చక్కటి పోషకాహారంతో చెక్‌ పెట్టచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజ. ఈ క్రమంలో రోజూ తీసుకోవాల్సిన పదార్థాలు, సప్లిమెంట్స్‌ గురించి వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారామె.
* జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. నట్స్‌ కూడా అందులో ఒకటి. ఈ క్రమంలో రోజూ ఏడు బాదంపప్పులు, రెండు వాల్‌నట్స్‌ తినాలి.
* టీస్పూన్‌ చొప్పున సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడచ్చు.
* పరగడుపునే టీస్పూన్‌ కొబ్బరి నూనె తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
* ప్రొటీన్‌ జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఇందుకోసం రోజూ మూడు కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక పచ్చసొన తీసుకోవడం మంచిది.


ఈ సప్లిమెంట్స్‌ మంచివి!
కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎదురయ్యే జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టాలంటే అందుకు విటమిన్‌ సప్లిమెంట్స్‌ చక్కగా దోహదం చేస్తాయి.
* శరీరంలో బి12 విటమిన్‌ లోపముంటే కొత్త జుట్టు పెరిగేందుకు ఇది అడ్డు పడుతుంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేయాలంటే ఈ విటమిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
* ‘డి’ విటమిన్‌ లోపం వల్ల అలొపేసియా (జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం) సమస్య తలెత్తుతుంది. కాబట్టి తగిన మోతాదులో డి విటమిన్‌ తీసుకోవాలి.
* కరోనా శరీరంలోని వివిధ కణజాలాలపై దాడి చేస్తోంది. దీన్ని అరికట్టాలంటే విటమిన్‌ ‘సి’ కూడా రోజూ తీసుకోవాల్సిందే! అయితే ఇలా తీసుకునే విటమిన్‌ సప్లిమెంట్స్‌, వాటి మోతాదు గురించి ముందు మీ డాక్టర్‌తో సంప్రదించి ఆ తర్వాత తీసుకోవడం ఉత్తమం.. అలాగే సప్లిమెంట్స్‌తో పాటు ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మరీ మంచిది..’ అంటున్నారు పూజ.

ఈ జీవనశైలి మార్పులతో..!


కొవిడ్‌ తర్వాత జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంతో పాటు లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
* కొవిడ్‌ తగ్గాక జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే సమస్య అంత త్వరగా తగ్గుతుందట! ఈ క్రమంలో వెంట్రుకల్ని ఇష్టమొచ్చినట్లుగా దువ్వడం, బ్లో డ్రయర్స్‌ వాడడం, కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్‌ చేయడం.. వంటివి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందట!
* జుట్టును అలాగే వదిలేయడం, బిగుతుగా హెయిర్‌స్టైల్స్‌ వేసుకోవడం, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ వాడడం.. అస్సలు మంచిది కాదు.
* ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి చక్కటి ఫలితాన్ని అందిస్తాయి.
* ఆకుకూరలు, మాంసం, చేపలు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవడం మంచిది. తద్వారా వీటిలోని పోషకాలు జుట్టు రాలే సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగిస్తాయి.

వీటితో పాటు నిపుణుల సలహా మేరకు ఇంటి చిట్కాలను సైతం ప్రయత్నించచ్చు. అయితే ఇలా కొవిడ్‌ రికవరీ తర్వాత మీరు ఏది చేసినా సొంత వైద్యం కాకుండా.. నిపుణుల వద్ద ఓసారి సలహా తీసుకున్నాకే ఫాలో అవడం మంచిది. తద్వారా ఉన్న సమస్యకు తోడు అదనంగా మరిన్ని దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు!


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని