అలా స్కూల్లో కలిశారు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు! - phillanthropist mackenzie scott marries seattle school teacher in telugu
close
Published : 07/07/2021 17:52 IST

అలా స్కూల్లో కలిశారు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు!

Photo: https://givingpledge.org/Pledger.aspx?id=393

మెకంజీ స్కాట్‌.. అపార సంపదతో పాటు అంతకుమించి మంచి మనసున్న వ్యాపారవేత్త. అమెజాన్‌లో షేర్‌ హోల్డర్‌గా ఉన్న ఆమె కరోనా సమయంలో ఏకంగా వేల కోట్లను విరాళాలుగా అందించారు. తద్వారా కష్టకాలంలో కోట్లాది మంది కన్నీరు తుడిచి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సమయంలోనే కాదు.. కరోనా రాకముందు కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆమె.. నవలా రచయిత్రిగానూ గుర్తింపు పొందారు. ఇలా ఓ వ్యాపారవేత్తగా, సామాజిక సేవకురాలిగా, నవలా రచయిత్రిగా.. అన్నింటా దూసుకుపోతున్న మెకంజీ ఇటీవలే మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి వైవాహిక జీవితం మిగిల్చిన చేదు అనుభవాలను మర్చిపోతూ రెండోసారి పెళ్లిపీటలెక్కారు.

పాతికేళ్ల బంధానికి స్వస్తి పలికి!

పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2019చివరిలో విడాకులు తీసుకున్నారు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌-మెకంజీ స్కాట్‌. ఈక్రమంలో భరణం కింద అమెజాన్‌లో స్కాట్‌కు 4 శాతం వాటాలు లభించాయి. ఇక విడాకుల సమయంలోనే తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు వెచ్చించేందుకు వీలుగా రూపొందించిన వీలునామాపై సంతకం కూడా చేశారు మెకంజీ. భార్యాభర్తలుగా తాము విడిపోయినా తమ మధ్య స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని విడాకుల సమయంలో బెజోస్‌, మెకంజీలు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే వ్యాపార రంగానికి సంబంధించి పలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో కలిసే పనిచేస్తున్నారీ మాజీ కపుల్‌. ఇక లాక్‌డౌన్‌ కాలంలో అమెజాన్‌ షేర్ల ధర భారీగా పెరగడంతో మెకంజీ సంపద కూడా మూడింతలకు పెరిగింది. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 54 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.

ఆమె మనసు వెన్న!

ఈ క్రమంలో జెఫ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న మెకంజీ తాజాగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సియాటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జెవెట్‌తో కలిసి ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’ అనే వెబ్‌ పేజీ ద్వారా తమ వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు డాన్‌. ‘నా జీవితంలో అత్యధిక భాగం ఉపాధ్యాయ వృత్తిలోనే గడిచిపోయింది. అదే సమయంలో ఓ నిత్య విద్యార్థిగా నా చుట్టూ ఉన్న మనసున్న మనుషుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారందరి స్ఫూర్తితో నాకు తోచిన సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను. అలాంటి మనుషుల్లో నాకు తెలిసి అత్యంత దయగల, మంచి మనసున్న మహిళ మెకంజీ. ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. దానధర్మాల విషయంలో ఇకపై ఆమె బాధ్యతల్లో నేను కూడా భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సంబరపడిపోతున్నారు డాన్‌.

అలా పరిచయమయ్యారు!

మెకంజీ భర్త జెవెట్‌ విషయానికొస్తే.. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సియాటెల్‌లోని లేక్‌సైడ్‌ పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మెకంజీ స్కాట్‌ నలుగురు పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెకంజీ, డాన్‌లకు పరిచయం ఏర్పడింది. సామాజిక సేవతో పాటు ఇతరత్రా అనేక అంశాల్లో  ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వారి మనసులు కూడా దగ్గరయ్యాయి. తాజాగా తమ బంధాన్ని శాశ్వతం చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారీ లవ్లీ కపుల్‌.

తను మంచి నిర్ణయం తీసుకుంది!

జెఫ్‌తో విడాకుల అనంతరం నలుగురు పిల్లల ఆలనాపాలనను తానే చూసుకుంటోంది మెకంజీ. ప్రస్తుతం వీరంతా సియాటెల్‌లోనే నివాసముంటున్నారు. తాజాగా మెకంజీని వివాహం చేసుకుని డాన్‌ కూడా ఈ కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య వివాహం చేసుకోవడం పట్ల అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘మెకంజీ మంచి నిర్ణయం తీసుకుంది. డాన్‌ కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి. కలిసుండాలని వాళ్లిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది..’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు జెఫ్‌.

గొప్ప మనసుకు దక్కిన గౌరవమది!

గతేడాది కొవిడ్‌ కారణంగా నష్టపోయిన అమెరికన్‌ మహిళలకు తనదైన చేయూతనందించారు మెకంజీ. ఇందులో భాగంగా 2020 చివరి నాలుగు నెలల్లో ఫుడ్‌బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్‌ ఫండ్స్‌కు సుమారు 4.1 బిలియన్‌ డాలర్లను విరాళంగా అందించారు. అంతకుముందు జులైలోనూ ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం.. తదితర అంశాలకు మద్దతుగా 1.7 బిలియన్‌ డాలర్లను వెచ్చించారు మెకంజీ. ఇలా మొత్తంగా సుమారు 6 బిలియన్ డాలర్ల సంపదను కేవలం సహాయం కోసమే కేటాయించిన ఆమె.. ‘ది క్రానికల్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీ’ వార్షిక ర్యాంకింగ్స్‌ ప్రకారం.. ‘2020లో స్వచ్ఛంద సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు అందించిన మొదటి 50 మంది అమెరికన్ల’లో రెండో స్థానంలో నిలవడం విశేషం.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని