Yoga : ఏం చేయాలి? ఏం చేయకూడదు? - Rules For Practicing Yoga Safely
close
Updated : 21/09/2021 13:04 IST

Yoga : ఏం చేయాలి? ఏం చేయకూడదు?

కరోనా ప్రభావంతో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం అని చెప్పచ్చు. పైగా దీనికెలాంటి జిమ్‌ పరికరాల అవసరం కూడా లేదు. కేవలం కొద్ది పాటి స్థలం, ఒక యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది.

అయితే ప్రతిదానికీ ఓ లిమిట్‌ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలిసుండాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. యోగా చేసే క్రమంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కూడా కొన్నున్నాయంటున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

అతి అనర్థమే!

‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నట్లు ఏదైనా అతిగా చేస్తే అనర్థాలు తప్పవు. యోగా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మెరుగైన ఫలితాలు పొందాలని ఎక్కువ సేపు యోగా చేయడం, శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఆసనాలు వేయడం వల్ల మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు. అందుకే మీ శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఆసనాలనే ఎంచుకోమంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే యోగా ప్రారంభించే వారు ఇతరులను చూసి ఆసనాలు వేయడం కాకుండా.. ఓసారి యోగా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లడం మంచిది.

అనువైన ప్రదేశం!

చెమటలు కక్కుతూ ‘హాట్‌ యోగా’ చేయడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అయితే అది కూడా గది ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు మించకూడదు. అంతేకాదు.. మరీ చల్లగా, అత్యంత వేడిగా ఉన్న ప్రాంతాలు, అధిక హ్యుమిడిటీతో నిండిన ప్రదేశాలు యోగాకు పనికి రావంటున్నారు. ఇలా అనువుగాని  ప్రదేశాల్లో యోగా చేస్తే లేని పోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుందంటున్నారు. ఇక గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో యోగా చేయడం అన్ని విధాలా అనుకూలం అంటున్నారు నిపుణులు.

శ్వాసపై ధ్యాస!

యోగాలో భాగంగా శ్వాస సంబంధిత ఆసనాలు కూడా కొన్నుంటాయి. ఈ క్రమంలో ఊపిరి తీసుకోవడం, వదలడం కీలకం. పలు ఆసనాల్లో కొన్ని సెకన్ల పాటు శ్వాసను బిగపట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అసాధారణ ఆసనాలు వేయడం, సొంత నైపుణ్యాలు పాటించడం కాకుండా నిపుణుల సలహాలు పాటించడం అత్యత్తమం.

నెలసరి సమయంలో..

నెలసరిలో ఉన్న వారు శీర్షాసనం వంటివి వేయరాదంటున్నారు నిపుణులు. అలాంటప్పుడు శ్వాస సంబంధిత వ్యాయామాలు/ఆసనాలు వారికి మేలు చేస్తాయంటున్నారు. అలాగే గర్భిణులు కచ్చితంగా నిపుణుల సలహాల మేరకే యోగాసనాలు వేయాలి.

బిగుతు వస్త్రాలు ధరించకండి!

యోగా చేసే సమయంలో మరీ బిగుతుగా, శరీరానికి అతుక్కుపోయే లాంటి దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే వీటి వల్ల పక్కటెముకలు, ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

వెంటనే స్నానం చేయద్దు!

యోగా పూర్తి కాగానే వెంటనే స్నానానికి వెళ్లకూడదు. చెమటలు కక్కిన దేహం సాధారణ స్థితికి వచ్చాకే స్నానం చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

ఎక్కువ నీళ్లు తాగద్దు!

యోగ సాధన చేసే సమయంలో శరీరం చెమటలు కక్కడం వల్ల ఎక్కువగా దాహమేస్తుంటుంది. అలాగని మరీ ఎక్కువ నీళ్లు తాగితే శరీరంపై భారం పడుతుంది. తద్వారా యోగ సాధనకు ఆటంకం కలుగుతుంది.

అలాగే యోగా తర్వాత ఎక్కువ శ్రమ కలిగించే వర్కవుట్లు చేయకపోవడం, యోగాకు కనీసం రెండు గంటల ముందే బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయడం/తినడం, అలసట/ఇతర అనారోగ్యాలున్నప్పుడు యోగ సాధన ఆపేయడం.. ఇవి కూడా యోగా చేసే క్రమంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలే!మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని