ఈ చట్నీతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెడదాం! - try this easy recipe of bajra amla chutney
close
Published : 10/08/2021 18:44 IST

ఈ చట్నీతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెడదాం!

ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సీజనల్‌ వ్యాధులతో పాటు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సమస్యలు తరచుగా ఇప్పుడే ఎదురవుతుంటాయి. తేమతో కూడిన వాతావరణం జీర్ణక్రియ రేటును నెమ్మదించేలా చేస్తే, కలుషితమైన ఆహారం మరిన్ని జీర్ణ సంబంధ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్‌లో శుద్ధి చేసిన నీరు, సమతులాహారం తీసుకోవాలంటారు వైద్యులు.

జీర్ణక్రియ సాఫీగా జరిగేలా!

ఇంగువ, సోంపు గింజలు, ఆవాలు, ఉసిరి, పుదీనా... ప్రతి వంటగదిలో కచ్చితంగా ఉండే ఈ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలా వీటితో సులభంగా చేసుకునే వంటకాల్లో ‘బాజ్రా - ఆమ్లా’ చట్నీ కూడా ఒకటి. ఎసిడిటీ సమస్యలను తగ్గించే సజ్జలు, ఉసిరికాయలను ఉపయోగించి సులభంగా ఈ తొక్కును తయారుచేసుకోవచ్చు.

బాజ్రా- ఆమ్లా చట్నీ

కావాల్సిన పదార్థాలు

* మొలకలు వచ్చిన సజ్జలు - అరకప్పు

* ఉసిరి కాయలు - 4

* పటిక బెల్లం - పావు కప్పు

* పచ్చి మిరపకాయలు - 3

* పసుపు - అర టీస్పూన్

* సోంపు గింజలు - అర టీస్పూన్

* ఆవాలు - అర టీస్పూన్

* మెంతులు - అర టీస్పూన్

* ఇంగువ – పావు కప్పు

* ఆవాల నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

* పుదీనా

తయారీ విధానం!

ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె వేసి ఆవాలు, సోంపు గింజలు, మెంతులు, ఇంగువ, పచ్చి మిరపకాయలు వేయించాలి. ఇవి చిటపటలాడడం మొదలయ్యాక మొలకెత్తిన సజ్జలు వేసి నిమిషం పాటు ఉడికించాలి. ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు, పసుపు, నీళ్లు జత చేసి గరిటె సహాయంతో బాగా కలపాలి. ఆపై పుదీనా ఆకులు వేసి మూత పెట్టాలి. 15 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత పటిక బెల్లం కూడా కలిపేసి కిందకు దించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. చివరగా పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుంటే రుచికరమైన బాజ్రా- ఆమ్లా చట్నీ రడీ!

బ్రెడ్‌, చపాతీలు, పరాఠాలు, వడలు, కబాబ్‌లు, రోల్స్‌, టోస్ట్‌లు, క్రాకర్స్‌తో దీనిని కలిపి తీసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు!

* కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చట్నీ ఉత్తమ ఆహారం.

* సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

* 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీ గ్రాముల ఐరన్‌ ఉంటుంది. అందుకే రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణులు వీటితో తయారుచేసిన పదార్థాలను తినాలని నిపుణులు సూచిస్తుంటారు.

* ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన సజ్జలను పిల్లలకు తినిపించడం వల్ల ఎత్తు పెరుగుతారు.

* ఇక ఈ చట్నీలో ఉపయోగించే పసుపు, పుదీనా, మెంతులు, ఇంగువ, సోంపు గింజలు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని