Avanthi Srinivas: ఏం చేస్తున్నావ్‌.. యూనిఫామ్‌ తీసేయ్‌: అవంతి శ్రీనివాస్‌

ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు అల్లూరి సీతారామరాజు స్వగ్రామం విశాఖ జిల్లా పాండ్రింగిలో నిరసన సెగ తగిలింది. సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసేందుకు అవంతి వచ్చారు. ఆ సమయంలో జనసేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అల్లూరి స్వగ్రామానికి రాకపోకలకు వీలుగా గోస్తనీ నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేశారు. హామీని విస్మరించిన అవంతికి, అల్లూరికి నివాళులు అర్పించే అర్హత లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.దీంతో వారిపై అవంతి చిర్రుబుర్రులాడారు. ఆందోళనకారులను కట్టడి చేయకుండా ఏం చేస్తున్నారంటూ పోలీసులపై రుసరుసలాడారు.‘ ఏం చేస్తున్నావ్?యూనిఫామ్‌ తీసేయ్‌’ అంటూ విరుచుకుపడ్డారు.

Published : 04 Jul 2022 19:49 IST

Tags :

మరిన్ని