Chandrababu: ఏం చేశారో, ఏం చేస్తారో.. జగన్‌ చెప్పుకోలేకపోతున్నారు: చంద్రబాబు

సీఎం జగన్‌ ఇంత వరకూ ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకోలేకపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు.

Published : 04 May 2024 14:09 IST

సీఎం జగన్‌ ఇంత వరకూ ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకోలేకపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నేను సంక్షేమం చేయలేదని జగన్‌ అంటున్నారు. నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లో 19.15 శాతం కేటాయిస్తే జగన్‌ కేటాయించింది 15.08 శాతం మాత్రమే. చేయని పనులకు జగన్‌ డబ్బా కొట్టుకుంటున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Tags :

మరిన్ని