Viral: రూ.కోటి డిమాండ్‌ చేస్తూ.. మనవడి నుంచి తాతకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో వినూత్న ఘటన జరిగింది. రూ.కోటి ఇవ్వాలంటూ సొంత తాతనే ఫోన్ ద్వారా బెదిరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్  వస్తున్నాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితుడికి బెదిరింపు కాల్స్ చేసింది ఆయన మనవడే అని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై ఇదివరకు కూడా ఓ చోరీ కేసు ఉన్నట్లు చెప్పారు

Published : 03 Dec 2022 18:06 IST

Tags :

మరిన్ని