YSRCP: తుపాకీ మన చేతుల్లోనే ఉందిగా.. ముందు మనమే పేల్చేద్దాం: ధర్మాన

వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో చెప్పొద్దనే మాట ఎవరన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా సత్యవాడలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన.. విపక్షాలపై మండిపడ్డారు. నిత్యావసర ధరలు ఏపీలోనే పెరుగుతున్నాయా? దేశమంతా ధరలు పెరుగుతుంటే ఏం చేయగలమని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనేనని చెప్పారు. మన చేతిలో తుపాకీ ఉంది, చంద్రబాబు కన్నా ముందు మనమే పేల్చేద్దాం.. పౌరులకు ఉండే హక్కులన్నీ వాలంటీర్లకు ఉంటాయని ధర్మాన వ్యాఖ్యానించారు. 

Updated : 06 Feb 2023 15:10 IST

మరిన్ని