Viral Video: అపార్ట్‌మెంట్‌లోకి రాకెట్లను వదిలిన యువకుడు.. వీడియో వైరల్‌

మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో ఓ పోకిరి వీరంగం సృష్టించాడు. దీపావళి పండగ రోజున ఓ అపార్ట్‌మెంట్‌లోకి రాకెట్లను విసురుతూ రాక్షసానందం పొందాడు. మండుతున్న తారాజువ్వలు కిటికీల నుంచి లోపలికి దూసుకొస్తుంటే.. అపార్ట్‌మెంట్‌వాసులు ఆందోళన చెందారు. కొద్ది సేపటికి యువకుడు, అతడి స్నేహితులు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. అతడు అలా ఎందుకు చేశాడో ఇంకా స్పష్టత రాలేదు.

Updated : 26 Oct 2022 15:00 IST

మరిన్ని