బంగారు మను
షూటింగ్లో సంచలనాలు రేపుతోంది మను బాకర్. ఈ ఏడాది మను పట్టిందల్లా బంగారమే. ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం గెలిచిన మను.. సూపర్‌ఫామ్ కొనసాగిస్తూ కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పట్టింది. ఇప్పుడు ఆమె లక్ష్యం ఆసియా క్రీడలు. ఒలింపిక్స్‌కు ముందు ఈ మెగా టోర్నీలో పసిడి గెలవాలని ఆమె పట్టుదలతో ఉంది. ఈసారి క్రీడల్లో మను ఎయిర్ పిస్టల్ విభాగంతో పాటు 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగాల్లోనూ పతకాలపై గురి పెట్టింది.
వయసు: 16 విభాగం: షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, మిక్స్డ్ ఎయిర్ పిస్టల్
పింగ్‌పాంగ్ కెరటం
కామన్వెల్త్ క్రీడల్లో మనిక బాత్రా ప్రదర్శన నిజంగా అద్భుతం. ఈ పోటీల్లో మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన మనిక.. సింగిల్స్‌లోనూ పసిడి గెలిచి సంచలనం సృష్టించింది. మహిళల డబుల్స్‌లో రజత, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం గెలిచి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది ఈ దిల్లీ అమ్మాయి. ఇక మనిక లక్ష్యం ఆసియా క్రీడల్లో సత్తా చాటడమే. అయితే ఆసియా.. కామన్వెల్త్ అంత వీజీ కాదు. చైనా, మలేసియా, సింగపూర్ నుంచి టాప్ స్టార్లు బరిలో ఉంటారు. ఈ నేపథ్యంలో మనిక ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. వయసు: 18 విభాగం: టేబుల్‌టెన్నిస్
ట్రాక్‌లో మ‘హిమ’
హిమదాస్.. కొన్ని వారాల క్రితం ఈ పేరు మార్మోగిపోయింది.. కారణం అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం గెలవడమే! ఫిన్లాండ్లో జరిగిన ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీ పరుగును 51.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి ఎగరేసుకుపోయింది. అండర్-20 ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఒక భారత అథ్లెట్ పసిడి గెలవడం ఇదే తొలిసారి. పీటీ ఉష తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌లో కెరటంలా దూసుకొచ్చిన ఘనత హిమదే. ఆసియా క్రీడల్లోనూ స్వర్ణానికి గట్టిపోటీదారుగా ఉంది ఆ అసోం అమ్మాయి. 200, 400 మీటర్ల పరుగులో హిమ పసిడి పతకం తేగలదు. 4×400 మీ రిలేలోనూ ఆమెది కీలక పాత్ర కానుంది. వయసు: 18 విభాగం: అథ్లెటిక్స్ 200 మీ, 400 మీ, 4×400 మీ రిలే
|