Viral video: అల్లరి మూకల బెదిరింపులు.. వ్యక్తిని కాళ్లకింద నలిపేసిన ఏనుగు
close

Published : 27/07/2021 20:35 IST
Viral video: అల్లరి మూకల బెదిరింపులు.. వ్యక్తిని కాళ్లకింద నలిపేసిన ఏనుగు

చండీగఢ్‌: కొంతమంది ఆకతాయిలు చేసిన పని ఓ వ్యక్తి మరణానికి దారితీసింది. పంజాబ్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం సమీపం నుంచి భారీ సంఖ్యలో ఏనుగుల గుంపు రహదారిని దాటేందుకు ప్రయత్నించాయి. ఎవరికి ఎలాంటి హానీ చేయకుండా వాటంతటవి రోడ్డు దాటుతుండగా.. గ్రామంలోని కొంతమంది ఆకతాయిలు రాళ్లు, కట్టెలతో వాటిని తరిమేందుకు ప్రయత్నించారు. వారిని దాటుకుంటూ గజరాజులన్నీ రోడ్డు దాటగా, చివరగా ఉన్న ఓ ఏనుగు ఆగ్రహంతో రోడ్డుపై ఉన్న అల్లరి మూకను తరిమింది. గజరాజు రావడాన్ని గమనించి వారంతా పరుగులు తీశారు. అయితే గుంపులోని ఓ వ్యక్తి అదుపుతప్పి కిందపడిపోయాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న గజరాజు కిందపడిన ఆ వ్యక్తి ప్రాణాలు పోయే వరకు కాళ్ల కింద నలిపేసింది. అనంతరం అది అడవిలోకి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడివారంతా ఖంగుతిన్నారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని