Viral Video: తియ్యటి సింహం!
close

Published : 17/06/2021 23:59 IST
Viral Video: తియ్యటి సింహం!

ఇంటర్నెట్‌డెస్క్‌: బంధించి ఉన్న సింహం దగ్గరకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడతారు. కానీ ఈ సింహాన్ని చూపిస్తే తినకుండా వదిలిపెట్టరు. ఎందుకంటే..! ఇదొక చాక్లెట్‌ సింహం. స్విట్జర్లాండ్‌కు చెందిన అమౌరీ గుయినోచ్ అనే పేస్ట్రీ చెఫ్‌ దీన్ని రూపొందించారు. వివిధ జంతువులు, రకరకాల వస్తువుల ఆకారాలను చాక్లెట్‌తో సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దడం గుయినోచ్‌ హాబీ. 5 అడుగుల 8 అంగుళాల పొడవు, 36 కిలోల బరువున్న ఈ చాక్లెట్‌ సింహాన్ని తయారు చేయడానికి అతనికి 5 రోజులు పట్టిందట. చాక్లెట్‌తో సింహం ఆకారాన్ని తయారుచేస్తున్న వీడియోను గుయినోచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకోగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని