Viral Video: చేతిపంపు కొట్టి నీరు తాగిన గజరాజు
close

Published : 08/06/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral Video: చేతిపంపు కొట్టి నీరు తాగిన గజరాజు

మహారాష్ట్ర: దాహంతో ఉన్న జంతువులు సాధారణంగా దగ్గర్లోని సరస్సుకో.. కుంటకో వెళ్లి దప్పిక తీర్చుకుంటాయి. అయితే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓ ఏనుగు భిన్నంగా ప్రవర్తించింది. కమలాపూర్ ఏనుగు శిబిరంలో ఉన్న రూపా అనే ఏనుగు చేతిపంపు కొట్టి మరీ దాహం తీర్చుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఏనుగులు నీరు తాగేందుకు సమీపంలో పెద్ద సరస్సు ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కానీ, చేతిపంపు కొట్టడం నేర్చుకున్న రూపా కొన్ని సార్లు ఇలా చేసి నీళ్లు తాగుతుందని చెప్పారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు