Afghanistan: పాకిస్థాన్‌లోకి అఫ్గాన్‌ ప్రజలు.. ఎలా వెళ్తున్నారంటే..?
close

Published : 26/08/2021 23:58 IST
Afghanistan: పాకిస్థాన్‌లోకి అఫ్గాన్‌ ప్రజలు.. ఎలా వెళ్తున్నారంటే..?

కాబుల్‌: తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గాన్‌లో ప్రజలు ఉండటానికే భయపడుతున్నారు. వారి చెర నుంచి తప్పించుకొని విదేశాలకు శరణార్థులుగా వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొద్ది రోజుల నుంచి కాబుల్‌ విమానాశ్రయం జనంతో పోటెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతం వద్ద వేలాది జనం గుమిగూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

తాలిబన్ల పాలన నుంచి తప్పించుకొని పాకిస్థాన్‌కు వెళ్లడానికి సరిహద్దు ప్రాంతానికి జనం పోటెత్తినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అఫ్గాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దు స్పిన్‌ బోల్‌డాక్ వద్ద చిత్రించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జర్నలిస్టు నటిక్‌ మాలిక్జడా అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశాడు. 

‘ఇది కాబుల్‌ ఎయిర్‌పోర్టు కాదు. అఫ్గాన్‌, పాకిస్థాన్ మధ్య ఉన్న స్పిన్‌ బోల్‌డాక్‌ సరిహద్దు ప్రాంతం. అఫ్గాన్‌లో ఉండలేక వేలాది జనం పాక్‌లోకి వెళ్లాలనుకుంటున్నారు. కాబుల్‌ ఎయిర్‌పోర్టు కంటే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి విదేశీ బలగాలు లేవు. మీడియా కూడా దీన్ని పట్టించుకోవడం లేదు’ అని ఈ వీడియోను షేర్‌ చేస్తూ ట్విట్‌ చేశాడు. పాకిస్థాన్‌ మాత్రం వలస ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. అఫ్గాన్‌ ప్రజలను లోపలికి చొచ్చుకురాకుండా ఉండటానికి సెక్యూరిటీని పెంచింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని