Viral Video: పులిని ఆటపట్టించిన శునకాలు!
close

Published : 31/07/2021 23:39 IST
Viral Video: పులిని ఆటపట్టించిన శునకాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పులితో ఆటలు ప్రమాదమన్న ఓ సినిమా డైలాగ్ అక్షరాల నిజమైంది. కర్ణాటకలోని బందిపొరా టైగర్ రిజర్వ్‌లో మూడు అడవి కుక్కలు పులిని ఆటపట్టించాయి. మూడు వైపుల నుంచి చుట్టుముట్టిన అడవి కుక్కలు పులిని ముప్పు తిప్పలుపెట్టాయి. చివరికి పొదల చాటుకు వెళ్లిన పులి పంజా విసరటంతో బెదిరిపోయిన అడవి కుక్కలు ప్రాణభయంతో తలో దిక్కు పరుగు పెట్టాయి. ఓ పర్యాటకుడు తన చరవాణిలో బంధించిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని