Viral Video: కూటికోసం పాట్లు
close

Published : 08/06/2021 22:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral Video: కూటికోసం పాట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ వల్ల యాచకుల పరిస్థితి దయనీయంగా మారింది. రైళ్లలో, ఫుట్‌పాత్‌ల మీద తిరుగుతూ తమకున్న కొద్ది ప్రతిభతో పొట్టనింపుకునే వాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అలాంటి ఒక వ్యక్తి కోల్‌కతాలోని వీధుల్లో వయొలిన్‌పై బాలీవుడ్‌ పాటలను వాయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆరిఫ్‌ షాహ్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకోగా వీడియోలోని వృద్ధుడు కోల్‌కతాకు చెందిన భోగోబన్‌ మాలిగా నెటిజన్లు గుర్తించారు. కాగా వృద్ధ సంగీతకారుడు లాక్‌డౌన్‌లో పొట్ట నింపుకోవడానికి వీధుల్లో వయొలిన్‌ వాయిస్తున్నాడని, ఉత్తర కోల్‌కతాలోని బీడన్‌ వీధుల్లో తరచుగా కనిపిస్తాడని నెటిజన్లు చెబుతున్నారు. వృద్ధుని ప్రతిభను మెచ్చుకుంటూ.. అతనికి తగినంత సాయం అందించాలని కోరుతున్నారు. 2.05 నిమిషాల నిడివిగల వీడియోలో వృద్ధుడు 1960ల నాటి దిల్‌ ఆప్నా ఔర్‌ ప్రీత్‌, కాశ్మీర్‌ కీ కళీ హిందీ చిత్రాల పాటలను వయొలిన్‌ మీద వినసొంపుగా వాయిస్తున్నాడు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు