Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
‘బడా’ బాదుడు!
జాతీయ రహదారిపై సుంకం రెట్టింపు
భారీ రవాణా వాహనాలపై రుసుం రెట్టింపు
నవంబరు 1 నుంచే అమలు
ఈనాడు, విజయవాడ: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో (ఎన్‌హెచ్‌16) విజయవాడ శ్రీకాకుళంవైపు వెళ్లే పలు టోల్‌గేట్లలో భారీ వాహనాలపై ఒక్కసారిగా సుంకం రెట్టింపు చేయడంపై వాహన యజమానుల్లో గగ్గోలు రేగింది. పెరిగిన పోటీతో కిరాయిలు తగ్గి వ్యాపారం మిణుకుమిణుకుమంటున్న తరుణంలో ఈ పెంపు తమను తీవ్రంగా దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహిస్తున్న తణుకు, కృష్ణవరం, వేంపాడు టోల్‌గేట్ల రుసుమును ఈ నెల 1 నుంచి సవరించింది. కార్లు, జీపులు, తేలికపాటి రవాణా వాహనాల రుసుముల్లో ఎలాంటి మార్పు లేకపోయినా, భారీ వాహనాలపై భారీగా వడ్డించింది. 4 నుంచి 6 యాక్సిళ్ల వాహనాలపై ఇదివరకు రూ.310 ఉండగా, నవంబరు 1 నుంచి అది రూ.615కి పెరిగింది. గతంలో ఒక నెలలో 50సార్లు టోల్‌గేట్‌ ప్రవేశానికి నిర్ణయించిన మొత్తం రూ.రూ.10415. తాజాగా రూ.20,625 చెల్లించాల్సి వస్తోంది. ఏడు యాక్సిళ్లు, అంతకు మించిన ఇతర అతి భారీ రవాణా వాహనాల రుసుములో ఎలాంటి మార్పు లేదు. 4 యాక్సిళ్ల లారీలు, ట్రక్కుల కంటే 6 యాక్సిళ్ల వాహనాలు 4 టన్నుల సరుకును అదనంగా మోయగలవు. అయితే రెండింటికీ మధ్య రుసుములో తేడాలను తొలగించడం అసంబద్ధమనేది వాహన యజమానుల వాదన. కేవలం 4 టన్నులకే రెట్టింపు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి కిలోమీటరుకు రూ.6 చొప్పున భారం పడుతుందని తెలిపారు. విజయవాడ నుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు 4 వరుసలుగా ఉన్న ఈ జాతీయ రహదారిని 6 వరుసలుగా అభివృద్ధి చేయడానికే రుసుములను పెంచినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 30న గోవాలో జరిగే జాతీయ మోటారు రవాణా మహాసభ నిర్వాహక కమిటీ సమావేశంలో ఈ విషయమై చర్చిస్తామని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు తెలిపారు. రాష్ట్ర విభజనతో రవాణా రంగం ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో సుంకం పోటు తగదని వ్యాఖ్యానించారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net