డ్రెడ్జింగ్‌ పనులపై రైతుల ఫిర్యాదు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రెడ్జింగ్‌ పనులపై రైతుల ఫిర్యాదు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణం: కృష్ణా కరకట్ట వెంబడి జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గురువారం రాజధాని రైతులు విజయవాడలోని ఏఎంఆర్డీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏఎంఆర్డీఏ కమిషనర్‌ కార్యాలయంలో ఏవో అనూరాధకు ఫిర్యాదు అందజేశారు. అమరావతిలో డ్రెడ్జింగ్‌ కారణంగా కరకట్ట బలహీనపడుతుందని, కరకట్ట కొట్టుకుపోయి రాజధానిలోకి నీరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి సేకరించిన భూమిని రైతులతో చేసుకున్న ఒప్పందాలకు లోబడి అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. అక్కడ ఇసుక తవ్వకాలకు, నిల్వ కేంద్ర అనుమతులు రద్దు చేయాలని రైతులు కోరారు. మరోపక్క రాజధాని గ్రామాల్లో 541వ రోజు దీక్షాశిబిరాలు కొనసాగాయి.
ఇది ప్రభుత్వ కుట్రే..: దేవినేని ఉమా
అమరావతి ప్రాంతంలోని తాళ్లాయపాలెం వద్ద డ్రెడ్జింగ్‌ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని మాజీ మంత్రి దేవినేవి ఉమామహేశ్వరావు గురువారం పరిశీలించారు. ఇసుక డంపింగ్‌ చేయడం వల్ల కరకట్టకు ముప్పు పొంచి ఉందన్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్ట తెగి నీరు ప్లాట్లలోకి ప్రవహిస్తే అమరావతి ముంపు ప్రాంతమని ముద్ర వేయడానికే ప్రభుత్వ పెద్దలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతేడాది కృష్టా నదికి వరద వచ్చినప్పుడు కొండవీటి వాగు ఎత్తిపోతల పంపుల ద్వారా నీటిని వదలకుండా అమరావతిని ముంచాలని చూశారన్నారు. విశాఖకు రాజధానిని మార్చడానికే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు