Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
ఇటలీ, పోర్చుగల్‌లో ఒక జట్టే ప్రపంచకప్‌కు

జ్యూరిచ్‌: వచ్చే ఏడాది ఖతార్‌లో జరిగే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పెద్ద జట్లయిన ఇటలీ, పోర్చుగల్‌ల్లో ఏదో ఒక్కటే ఆడబోతోంది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ ప్లేఆఫ్స్‌లో ఈ రెండు జట్లూ ఒకే బ్రాకెట్‌లో ఆడబోతున్నాయి. నాలుగు జట్లున్న ఈ బ్రాకెట్‌ నుంచి ఒక్క జట్టే ముందంజ వేస్తుంది. ఈ స్థానం కోసం తుది ప్లేఆఫ్‌కు ముందు మార్చిలో ఉత్తర మెసెడోనియాతో ఇటలీ, టర్కీతో పోర్చుగల్‌ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో ఇటలీ, పోర్చుగల్‌ నెగ్గినా ప్రపంచకప్‌ బెర్తు కోసం జరిగే చివరి పోరులో ఈ రెండింట్లో ఏది నెగ్గితే దానికే ఖతార్‌ వెళ్లే అవకాశం దక్కుతుంది. మరి మాజీ ఛాంపియన్‌ ఇటలీ ముందంజ వేస్తుందా.. లేక రొనాల్డో జట్టు పోర్చుగల్‌ ఛాన్స్‌ అందుకుంటుందా చూడాలి.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.