
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావుకు జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. ‘భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం’(ఐఏయూఏ)కు సెక్రటరీ జనరల్‌గా ఆయన ఎంపికయ్యారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, విద్య, విస్తరణను ప్రోత్సహించటం ఐఏయూఏ ప్రధాన లక్ష్యం. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రవీణ్‌రావు అన్నారు.