ఐదో తేదీ వచ్చినా అందని జీతాలు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో గళం

ఈనాడు, అమరావతి: చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదో తేదీ వచ్చినా ఇంకా జీతాలు అందలేదు. పెన్షనర్లు, కొందరు ఉద్యోగులు నెలనెలా కొనుక్కోవాల్సిన మందుల కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యా నాకింకా జీతం పడలేదు. వేసి పుణ్యం కట్టుకొండయ్యా ఈఎంఐ డేట్స్‌ దాటేశాయి’’, ‘‘శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి అందని జీతాలు’’, ఐదో తేదీ ముగుస్తున్నా జీతాల విషయం అడగని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దాదాపు సగం మంది ఉద్యోగులకు వేతనాలు రావాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. జీతం చెల్లింపులో జాప్యంపై ఐక్య ఉపాధ్యాయ సంఘం(యూటీఎఫ్‌) నిరసన తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను ప్రభుత్వం తీవ్ర వేదనకు గురి చేస్తోందని, కారణాలు ఏమైనా పని చేసిన ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండు చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని