ఉద్యోగుల డబ్బుల కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు

ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు దాచుకున్న రూ.3వేల కోట్లు తిరిగి పొందేందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వంలో ఎవ్వరూ స్పష్టత ఇవ్వట్లేదని, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.7వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ల మొత్తాలను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నతస్థాయి సమావేశాల్లో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా వాయిదా వేస్తున్నారు. సీఎం స్వయంగా జులై నెలాఖరుకు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ చేయలేదు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత విద్యకు డబ్బుల కోసం విలవిలలాడుతున్నారు. వాళ్లను ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. పీఆర్సీ బకాయిలపై ఉత్తర్వులు ఇవ్వలేదు. కొత్త జిల్లా ఉద్యోగులకు 16% హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి’ అని డిమాండు చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వైవీ రావు, అసోసియేట్‌ ఛైర్మన్‌ టీవీ ఫణి పేర్రాజు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని