విలీనంతో ఉపాధ్యాయులకు పదోన్నతులు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

ఈనాడు, అమరావతి: ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లగా పదోన్నతులు లభిస్తాయని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలిపారు. విలీనంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మేలు జరుగుతుందనే అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు ‘‘సీఎం జగన్‌ విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు, ఎనిమిదో తరగతి వారికి ట్యాబ్‌లు అందిస్తున్నాం. కార్పొరేట్‌ పాఠశాలల్లో మాత్రమే అందించే బైజూస్‌ కంటెంట్‌ను ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఇస్తున్నాం’’ అని వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని