సింధు విజయంపై దేశం గర్విస్తోంది

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
యువతకు స్ఫూర్తిదాయకం : సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన షట్లర్‌ పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్‌సాయిరాజ్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించారు. సింధు విజయానికి దేశం గర్విస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. ‘భారత బ్యాడ్మింటన్‌కు ఈ రోజు సువర్ణదినం. అసాధారణ విజయాలు సాధించిన ఛాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్య సేన్‌లకు శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. వీరంతా యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కామన్వెల్త్‌ పతకాల పట్టికలో దేశం పేరును గర్వించదగ్గ స్థానంలో నిలిపినందుకు భారత క్రీడాకారుల బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  తెలుగు తేజం పీవీ సింధుకు రాష్ట్ర క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అభినందించారు.

త్యాగస్ఫూర్తిని సూచించేదే మొహర్రం : గవర్నర్‌  

మొహర్రం మానవాళిలో ఉండే అన్ని ధర్మాల కంటే మిన్న అయిన త్యాగ స్ఫూర్తిని సూచిస్తుందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ఆయన సోమవారం సందేశమిచ్చారు. ‘ఇస్లాం ప్రధాన సూత్రమైన మానవతావాదాన్ని మూర్తీభవించే మొహర్రం స్ఫూర్తిని ప్రతి ఒక్కరం అనుకరిద్దాం. ఎల్లప్పుడూ శాంతిని పెంపొందించుకోవాలని, సోదరభావం, ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయాలని మొహర్రం సూచిస్తుంది’అని గవర్నర్‌ తెలిపారు.

త్యాగానికి, ధర్మపరిరక్షణకు మొహర్రం ప్రతీక అని సీఎం జగన్‌ తెలిపారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి గుర్తుగా జరుపుకునే ఈ పవిత్ర సంతాప దినాలు.. రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని