బంగాళాఖాతంలో అల్పపీడనం

కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

ఈనాడు, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళ, బుధవారాల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ప్రయాణిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిందని వివరించారు. ఈ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు