
IPPB: రూ.396తో రూ.10 లక్షల బీమా
ఐపీపీబీలో ప్రమాద బీమా పాలసీలు
ఈనాడు, హైదరాబాద్: ప్రమాదం చెప్పి రాదు... త్రుటిలో తప్పితే మళ్లీ పుట్టినట్టే. కాని తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణహాని జరిగితే.. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే... ఆ లోటు తీర్చడం ఎవరితరం కాదు. ప్రమాదానికి గురైన వ్యక్తిమీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి సమయంలో ఆదుకునేందుకు రెండు పాలసీలున్నాయి. ఒక పాలసీ ప్రీమియం రూ.396 కాగా, మరో పాలసీ ప్రీమియం రూ.399. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా రూ.10 లక్షల బీమా ఆ కుటుంబానికి అందుతుంది. ఐపీపీబీ (ఇండియా తపాలా పోస్టు పేమెంట్ బ్యాంకు)ద్వారా ఈ పాలసీలు పొందవచ్చు. టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ, బజాజ్ అలియాంజ్ సంస్థలు అందజేస్తున్న ఈ పాలసీలను తపాలా శాఖ ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. 16 నుంచి 65 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీలో చేరవచ్చు. ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉన్నవారు అర్హులు. ఈ బీమాను తీసుకోవాలనుకుంటే.. నేరుగా ఐపీపీబీ శాఖలున్న తపాలా కార్యాలయాలకు గాని, లేదంటే గ్రూపుగా చేరాలనుకుంటే తపాలా సిబ్బందే నేరుగా వస్తారని తపాలా అధికారులు చెప్పారు.
* టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ(రూ.399)లో పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వత అంగవైకల్యం వచ్చినా, పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు ఆ వ్యక్తి పేర్కొన్న నామినీకి అందుతుంది. చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూ.లక్ష రుణం కూడా ఇస్తారు. 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లు చెల్లిస్తారు. 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా వాస్తవ బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది ఇస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్ఠంగా రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. ఒక వేళ మృతి చెందితే రూ.5 వేలు అంత్యక్రియలకు అందిస్తారు.
* రూ.396 చెల్లించి బజాజ్ అలియాంజ్ ద్వారా ప్రమాద బీమా తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల బీమా సొమ్ము అందుతుంది. బజాజ్ అలియాంజ్‌లో అయితే ప్రమాదం ఎలా జరిగినా బీమా మొత్తం అందుతుంది.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!