Andhra News: 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష

అమరావతి: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న పలువురికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఖైదీలను విడుదల చేయాలని హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల కానున్న ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తు జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. శిక్షాకాలం ముగిసే వరకూ 3 నెలలకోసారి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. నేరపూరిత చర్యలకు పాల్పడితే తక్షణమే రీ అరెస్ట్‌ అవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. సత్ప్రవర్తన కలిగిన మరో 20 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 


మరిన్ని

ap-districts
ts-districts