Kalapuram: పవన్‌ కల్యాణ్‌ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడాసెంటర్‌’ చిత్రాల ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా ‘కళాపురం’ (Kalapuram). ఇక్కడ అందరూ కళాకారులే.. అనేది ఉపశీర్షిక. సత్యం రాజేశ్‌ (Satyam Rajesh), చిత్రం శ్రీను, సంచిత, ప్రవీణ్‌ యండమూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘సినిమా తీయాలంటే టాలెంట్‌ ఒక్కటే కాదు.. లక్‌ కూడా ఉండాలి’ అని సత్యం రాజేశ్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు సంభాషణలు బట్టి తెలుస్తోంది. కళాపురం అనే గ్రామంలోనే తన సినిమాని తెరకెక్కించాలనుకున్న సత్యం రాజేశ్‌ కల నెరవేరిందా, లేదా? కళాపురంలో ఎంతమంది కళాకారులున్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జీ స్టూడియోస్‌, ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.



మరిన్ని

ap-districts
ts-districts