CWC 2022: రెజ్లింగ్‌ స్టేడియంలో కలకలం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ పోటీలు నిర్వహిస్తున్న స్టేడియంలో కలకలం రేగింది. పై నుంచి ఆడియో పరికరాలు కింద పడి గందరగోళ వాతావరణం నెలకొనడంతో రెండు గంటల పాటు పోటీలు ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రెజ్లింగ్‌ పోటీలు శుక్రవారం ఉదయమే ఆరంభం కాగా.. కాసేపటికే ఆడియో పరికరాలు పైనుంచి కిందపడడంతో స్టేడియంలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే నిర్వాహకులు అధికారులతో పాటు బౌట్‌లు చూసేందుకు వచ్చిన అభిమానులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. తర్వాత పోటీలు పునఃప్రారంభమయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts