సంక్షిప్త వార్తలు

న్యాక్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: వేముల

ఈనాడు, హైదరాబాద్‌: న్యాక్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. న్యాక్‌లో చేపడుతున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఉద్యోగులతో చర్చించి, వారి సమస్యలేంటో తెలుసుకోవాలని సంబంధిత శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజును ఈ సందర్భంగా ఆదేశించారు.


కొత్తగా 291 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 291 కొవిడ్‌ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,29,202కు పెరిగింది. ఈ నెల 14న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,446 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts