close

తాజా వార్తలు

ఆసుస్‌ ఫోన్లలో ఇకపై ఆ పదం కనిపించదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఆసుస్‌కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇకపై జెన్‌, జెన్‌ఫోన్‌ పేరుతో ఫోన్లుగానీ, ఇతర ఉత్పత్తులుగానీ విక్రయించకూడదని నియంత్రణ విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేరుతో విక్రయాలు జరపకుండా ఆదేశాలివ్వాలని టెలికేర్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై  ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

తాము 2008 నుంచి జెన్‌, జెన్‌ మొబైల్‌ పేరిట ఫీచర్‌ ఫోన్లు, స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్నామని తన పిటిషన్‌లో టెలికేర్‌ నెట్‌వర్క్‌ పేర్కొంది. ట్రేడ్‌మార్క్‌ చట్టం 1999 ప్రకారం ఇది నేరమని తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇది ఆ కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చడంతో పాటు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తుందని అభిప్రాయపడింది. దీనిపై ఆసుస్‌ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ తాము ఎప్పటి నుంచో ఆసుస్‌ ప్రధాన రిజిస్టర్‌ మార్క్‌తో పాటు జెన్‌ఫోన్‌ అనే పదాన్ని జోడించి విక్రయాలు చేపడుతున్నట్లు, ఇందులో గందరగోళానికి ఆస్కారం లేదని తెలిపింది. దీనిపై తదుపరి విచారణ జులై 10న జరగనుంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు