close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విరమణ తరువాతావిశ్రమించకుండా!

డప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తికి చెందిన సుబ్రహ్మణ్యకుమార్‌, సరస్వతమ్మ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. సుబ్రహ్మణ్యకుమార్‌ మైదుకూరు ఈవోఆర్డీగా గతేడాది పదవీ విరమణ చేశారు. సరస్వతమ్మ చాగలమర్రి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా గతేడాది మే నెలలో పదవీ విరమణ పొందారు. ఈమె ఇక్కడే 15ఏళ్ల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించారు. తన ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మూడు సార్లు తెలుగు సబ్జెక్టులో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేశారు. పాఠశాలపై ఉన్న మమకారం, వృత్తిపై ఉండే అంకితభావం ఆమెను తిరిగి పాఠశాలకు వచ్చేలాచేశాయి. పదవీ విరమణ పొందినా... గతేడాది జులై 1నుంచి అదే పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి అనుమతితో పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్టులో దిశానిర్దేశం చేస్తున్నారు. పోట్లదుర్తి నుంచి రోజూ చాగలమర్రికి 100కి.మీ. తన సొంత ఖర్చులతో వచ్చి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఎందరో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘‘గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. నా శక్తికి తగ్గట్లు విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నా. వారు పరీక్షల్లో విజయం సాధిస్తే చాలు... నాకు జీతం వచ్చినదాని కన్నా ఎక్కువగా సంతోషిస్తా.’’

- సరస్వతమ్మ

- పి.గోవిందయ్య, చాగలమర్రి


మరిన్ని