close

తాజా వార్తలు

మట్టపల్లి లక్ష్మీనరసింహ ఆలయంలోకి వరద

సూర్యాపేట: భారీ వర్షాలకు కృష్ణమ్మ నది పొంగి పొర్లుతోంది. దీంతో సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో గల శ్రీలక్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ గర్భగుడిలోకి మూడు అడుగుల మేర నీరు వచ్చింది. ప్రహారీగోడ దెబ్బతినడంతో వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో కృష్ణానది ఉప్పొంగిప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ వద్ద నది ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు