close

సినిమా

సందడికి సైరా

చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘సైరా  నరసింహారెడ్డి’ ప్రచార సందడికి తెర లేచింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒక రోజు ముందుగానే సినిమా మేకింగ్‌ వీడియోని విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులే జరుగుతున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. చిత్రాన్ని అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ప్రచారకార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేయనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సినిమాని మొదలుపెట్టారు. అందుకు తగ్గట్టుగానే పలు భాషలకి చెందిన నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నాయికలు నయనతార, తమన్నా, అనుష్కలతో పాటు జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు