close

తెలంగాణ

జ్వరాలపై రాజకీయం వద్దు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

తెలంగాణలో విషజ్వరాల నియంత్రణకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నామన్నారు. పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి, ఇబ్బందులు పడకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సర్కారు దవాఖానాలకు వస్తున్న రోగుల సంఖ్య.. ప్రభుత్వ వైద్యంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. శాసనసభలో వైద్య, ఆరోగ్యశాఖ పద్దుపై మంత్రి ఈటల మాట్లాడారు. రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఫీవర్‌ ఆస్పత్రిలో ఆరింటి స్థానంలో 25 కౌంటర్లు ఏర్పాటుచేశామని చెప్పారు. జ్వరాలపై అనవసర రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాల్ని కోరారు. నమోదు చేసుకున్న వారందరికీ కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నామని, ఇందుకోసం రూ.731 కోట్లను వ్యయం చేశామన్నారు

జ్వర నియంత్రణ చర్యలు తెలపండి: భట్టి
గతంలో చేసినదాన్నే ప్రభుత్వం పదేపదే చెబుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. శాననసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి వాస్తవాలు చెబుతున్నారని, వినాలని సూచించారు. భట్టి స్పందిస్తూ మంత్రి ఈటల ఇటీవల నిజం చెప్పగా శబ్దతరంగాలు బయటకు రాకుండా ఆపేశారన్నారు.

మీ రికార్డును ఎవరూ దాటలేరు
వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభలో మాట్లాడిన రికార్డును ఎవరూ దాటలేరని మంత్రి శ్రీనివాసగౌడ్‌ అన్నారు. వ్యవసాయ పద్దులపై రాత్రి రెండుగంటల సమయంలోనూ ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. పద్దులపై సమాధానాన్ని త్వరగా ముగించాలని సభాపతి పోచారం సూచించినప్పుడు మంత్రి పైవిధంగా స్పందించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు