close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ వారం మహిళలు

 నందితాదాస్‌కు పురస్కారం

ఈ వారం మహిళలు

ప్రముఖ దర్శకురాలు, నటి నందితాదాస్‌ను ‘2018 - ఎఫ్‌ఐఏపీఎఫ్‌Æ(ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అకాడమీ)’ అవార్డు వరించనుంది. ఈనెల 29న ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న 12వ ఆసియా పసిఫిక్‌ స్క్రీన్‌ అవార్డుల వేడుకలో నందిత ఈ అవార్డును తీసుకోబోతోంది. ఆసియా ఫసిఫిక్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేయడంలో నందిత ప్రముఖపాత్ర వహించడమే కాదు, భారతీయత ఉట్టిపడే చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నందుకే ఈ అవార్డు అని చెబుతున్నారు నిర్వాహకులు. 

బీబీసీలో జాబితాలో ఈ ముగ్గురు

ఈ వారం మహిళలు

ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో తమదైన సేవలను అందించి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన 100 మంది మహిళలను బీబీసీ ఎంపిక చేసింది.  వీరిలో మనదేశానికి చెందిన ముగ్గురు మహిళలున్నారు. పశ్చిమబంగాకు చెందిన 36 ఏళ్ల మీనా గయేన్‌ సుందర్బన్స్‌ డెల్టా సమీపంలోని గిరిజనుల గ్రామాలను కలుపుతూ మార్గాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించింది. పరగనా జిల్లాకు చెందిన నఫర్‌జంగ్‌ గ్రామపంచాయతీకి రహదారి లేదు. దీంతో సమష్టిగా కృషి చేస్తే ఆ గ్రామంలో రహదారుల సౌకర్యంతోపాటు, సమీప గ్రామాలతో కలవొచ్చనే అవగాహన కలిగించింది మీనా. అలా మహిళలంతా రహదారి నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఓ ఎన్జీవో నుంచి ఇటుకలు అందేలా చేసింది మీనా. దాదాపు 10 కిలోమీటర్ల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించుకున్నారు. ఇలా 18 రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకుని 20 గ్రామాలను కలిపారు. 

ఈ వారం మహిళలుకేరళకు చెందిన విజ్జి పెన్‌కుట్టి దుకాణాల్లో విధులు నిర్వహించే సమయంలో మహిళలకు కూర్చునే సౌకర్యం, అలాగే వారికి మరుగుదొడ్డి వంటి ప్రాథమిక అవసరాలు తీర్చాలంటూ... పోరాడింది. దీంతో కేరళ ప్రభుత్వం నుంచి స్థానిక దుకాణాల్లో పనిచేసే మహిళలకు కూర్చునే సౌకర్యంతోపాటు, కనీస సౌకర్యాలను అందించాలంటూ దుకాణదారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీబీసీ ఆమె కృషిని గుర్తించి వందమందిలో ఒకరిగా ప్రకటించింది. 

 

ఈ వారం మహిళలు మహారాష్ట్రకి చెందిన 56 ఏళ్ల రహిబాయ్‌ సోమా పోపెరే సంప్రదాయ పంటల పరిరక్షణకు కృషి చేసింది. పాత పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచే దిశగా విత్తన బ్యాంకును   నిర్వహించింది. 80 రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచింది. సొంతంగా వ్యవసాయం చేస్తూ, మహిళా స్వయం ఉపాధి సంఘానికి నేతృత్వం వహిస్తోంది. చుట్టుపక్కల   గ్రామాలన్నింటికీ సోలార్‌ ల్యాంప్‌ల పంపిణీలో ప్రధానపాత్ర ఈమెదే. వ్యవసాయరంగంలో ఈమె చేసిన సేవలకు ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి’ విభాగం ‘సీడ్‌ మదర్‌’   అనే బిరుదుతో కూడా సత్కరించింది.


 


మరిన్ని