close

తాజా వార్తలు

సీబీఎస్‌ఈ 10లో ఒకే ధ్రువపత్రం

న్యూదిల్లీ: ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఒకే ధ్రువపత్రం ఇవ్వనున్నట్లు ఆ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకూ మార్కుల జాబితా వేరుగా, తరగతిలో ఉత్తీర్ణత సాధించినట్లు వేరుగా ధ్రువపత్రాలు జారీ చేసేవారు. ఇక నుంచి రెండింటికీ కలిపి ఒకే ధ్రువపత్రాన్ని జారీ చేయనున్నారు. ఈ ధ్రువపత్రం అన్ని చోట్ల చెల్లుతుందని, నకలు పొందాలనుకునే వారు సరైన విధానం అనుసరించి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామన్నారు. సీబీఎస్‌ఈ బోర్డు కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాత విధానాన్నే అమలు చేస్తున్నామన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, మార్కుల జాబితాలు ఇస్తామని తెలిపారు. ఏదేని సబ్జెక్టులో మార్కులు మెరుగు పరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షకు హాజరు కావచ్చన్నారు. కాని ఒక సబ్జెక్టులో పెరిగిన మార్కుల కోసం మొత్తంగా మరో మార్కుల జాబితా ఇవ్వబోమని, సంబంధిత సబ్జెక్టులో మార్కులు పెరిగినట్లు మాత్రమే ధ్రువపత్రం ఇస్తామని ఆయన అన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ సంవత్సరం పరీక్షలు రాసుకోవచ్చని, ప్రాక్టికల్స్‌లో సాధించిన మార్కులు అలానే ఉంటాయని తెలిపారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు