40% తగ్గిన విమాన ప్రయాణికులు - 40 percent discount on air passengers
close

Published : 19/02/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

40% తగ్గిన విమాన ప్రయాణికులు

జనవరిలో 77.34 లక్షలే: డీజీసీఏ

ముంబయి: కరోనా మహమ్మారి ప్రభావం విమాన ప్రయాణాలపై ఇంకా కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో 40 శాతం మేర తగ్గి 77.34 లక్షలకు పరిమితమయ్యాయని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) వెల్లడించింది. కాగా 2020 జనవరిలో 1.27 కోట్ల ప్రయాణికులు దేశీయ మార్గాల్లో ప్రయాణించినట్లు పేర్కొంది. ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా, గోఎయిర్‌, విస్తారా, ఎయిరేషియా ఇండియాల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యం (లోడ్‌ ఫ్యాక్టర్‌) 70-64.9 శాతం మధ్య నమోదైంది. ఇండిగో 54.30 శాతం మార్కెట్‌ వాటాతో 42.03 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసింది. దీని తరవాత విస్తారా 12.8 శాతం వాటాతో 9.92 లక్షల మందిని చేరవేసింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి బయలుదేరే లేదా చేరుకునే ఇండిగో విమానాలు 93.7 శాతం కచ్చిత సమయానికి నడిచాయని డీజీసీఏ పేర్కొంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని