close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వైరస్‌: ఏటీఎంలలో ఇలా డ్రా చేసుకోవచ్చా?

ముంబయి: కరోనా వైరస్‌ విజృంభణతో ఏది తాకాలన్నా భయం వేస్తోంది. డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లాలన్నా చాలా మంది తటపటాయిస్తున్నారు. ఎందుకంటే ఏటీఎంలోకి వెళ్లడం దగ్గరి నుంచి నగదు డ్రా చేసి బయటకు వచ్చే వరకూ మన చేతులు ఏదో ఒక దాన్ని తాకుతూనే ఉండాలి. దీంతో కొందరు శానిటైజర్‌ను వెంట తీసుకుని వెళ్లి, డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాయట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రొటోటైప్‌ను ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ తయారు చేసింది. బ్యాంకుకు చెందిన మొబైల్‌ యాప్‌ను ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌చేయడం ద్వారా మనకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. 

సాధారణంగా మనం ఏటీఎంకు వెళ్తే, డెబిట్‌/క్రెడిట్‌కార్డును మెషీన్‌లో ఉంచి, పిన్‌ ఎంటర్‌ చేసి, నగదు ఉపసంహరణకు సంబంధించిన ఆప్షన్స్‌ను ఎంచుకుంటాం. కానీ, కొత్త పద్ధతిలో ఏటీఎంకు వెళ్లిన తర్వాత మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ ద్వారా అక్కడి తెరపై కనిపించే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌లోనే ఏటీఎం పిన్‌, కావాల్సిన మొత్తాన్ని నమోదు చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ దాదాపు 70వేలకు పైగా ఏటీఎంలను నిర్వహిస్తోంది. ప్రాథమిక దశలో కాంటాక్ట్‌లెస్‌ ఏటీఎం సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు రెండు బ్యాంకులు అంగీకరించాయట. మరో నాలుగు బ్యాంకులతో ఈ విషయమై చర్చిస్తున్నారు. కొత్త పద్ధతికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో‌ మార్పులు, అమలు ప్రక్రియకు ఎనిమిది వారాలకు పైగా పడుతుందని ఏజీఎస్‌ చెబుతోంది. 

క్యూర్‌ కోడ్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడం మరింత సురక్షితమని ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ సీటీవో మహేశ్‌ పటేల్ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోనే పొందుపరచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు తమ యాప్‌ను కార్డ్‌లెస్‌ విత్‌డ్రాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.