​​​​​​ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధన అమలు వాయిదా - Govt defers mandatory installation of front seat airbags in existing car models till Dec 31
close

Published : 27/06/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధన అమలు వాయిదా

దిల్లీ: ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లలో ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనను కేంద్రం వాయిదా వేసింది. దీనికి నిర్దేశించిన గడువును రహదారుల మంత్రిత్వ శాఖ మరో నాలుగు నెలలు పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. తాజా గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 1, ఆ తర్వాత తయారైన వాహనాలకు ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తూ మార్చి 6న రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఉత్పత్తి అయిన మోడళ్లకు ఆగస్టు 31ను గడువుగా నిర్ణయించారు. దాన్ని తాజాగా నాలుగు నెలలు పొడిగించారు. డ్రైవర్‌ సీటుకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి నిబంధన చాలా రోజులుగా అమలవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని