ఎల్ఐసీ వారి జీవ‌న్ లాభ్ - ఎంత లాభం? - LIC-Jeevan-labh
close

Published : 25/12/2020 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్ఐసీ వారి జీవ‌న్ లాభ్ - ఎంత లాభం?

ఎల్ఐసీ అందించే జీవ‌న్ లాభ్ పాల‌సీ పరిమిత కాల ప్రీమియం, నాన్ లింకెడ్‌, రాబ‌డి లాభంతో వ‌చ్చే ఎండోమెంట్ ప్లాన్‌.

డెత్ బెనిఫిట్‌:
బీమా చేసిన వ్య‌క్తి, పాల‌సీకి సంబంధించిన అన్ని ప్రీమియంలు చెల్లించిన త‌రువాత పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే, మ‌ర‌ణ హామీ మొత్తం, దీంతో పాటు, సింపుల్‌ రివర్సిషనరీ బోనస్‌లు, తుది లేదా అదనపు బోనస్‌లు, తదితర ప్రయోజనాల‌ను అందిస్తుంది.

మ‌ర‌ణ హామీ మొత్తం అంటే - ఒకవేళ పాలసీదారుడు, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మరణిస్తే, కనీస బీమా రక్షణ మొత్తం గానీ, వార్షిక ప్రీమియానికి పదిరెట్ల మొత్తం గానీ చెల్లిస్తారు ఏది అధికంగా ఉంటే ఆమొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం… పాలసీదారుడు మరణించేనాటికి చెల్లించిన మొత్తం ప్రీమియానికి 105 శాతం కంటే తక్కువ కాకుండా ఉంటుంది.

మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాలు:
పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత, పాలసీదారుడికి బీమా హామీ మొత్తంతో పాటు సింపుల్ రివర్సిషనరీ బోనస్‌లు, తుది అదనపు బోనస్‌లు, తదితర ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఇందుకు గానూ పాల‌సీ పూర్తైయ్యే నాటికి చెల్లించ‌వ‌ల‌సిన అన్ని ప్రీమియంలు పూర్తిగా చెల్లించి ఉండాలి.

లాభాల‌లో భాగ‌స్వామ్యం:
కంపెనీ పొందే లాభాల నుంచి పాల‌సీ దారునికి కొంత కేటాయిస్తారు. అందువ‌ల్ల పాల‌సీ పూర్తి స్థాయిలో అమ‌లులో ఉంటే ప్ర‌క‌టించిన సింపుల్ రివర్షనరీ బోనస్‌లను స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. పాల‌సీకి వ‌ర్తించే ఆఖ‌రి(అద‌న‌పు) బోన‌స్ ప్ర‌యోజ‌నాల‌ను మెచ్యూరిటీ స‌మ‌యంలో కానీ లేదా బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ప్పుడు కానీ చెల్లిస్తారు.

ఆప్ష‌న‌ల్ ప్ర‌యోజ‌నాలు:
బీమా చేసిన వ్య‌క్తికి ఈ కింది పాల‌సీల‌ను రైడ‌ర్లుగా ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంది.

 • ఎల్ఐసీ వారి యాక్సిడెంట‌ల్ డెత్, డిజేబిలిటి బెనిఫిట్ రైడ‌ర్‌

 • ఎల్ఐసీ వారి కొత్త ట‌ర్మ్ అష్యూరెన్స్ రైడ‌ర్‌

అర్హ‌త‌, ఇత‌ర నియ‌మాలు:

 • క‌నీస హామీ మొత్తం రూ. 2 ల‌క్ష‌లు

 • గ‌రిష్ట హామీ మొత్తం : ప‌రిమితి లేదు.

 • బేసిక్ హామీ మొత్తాన్ని రూ. 10,000 గుణిజాల‌లో అందిస్తారు.

 • పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి - ప్రీమియం చెల్లించ‌వ‌ల‌సిన కాల‌వ్య‌వ‌ధి:
  - 16 సంవ‌త్స‌రాల‌కు పాల‌సీకి 10 సంవ‌త్స‌రాలు,
  - 21 సంవ‌త్స‌రాల పాల‌సికి 15 సంవ‌త్స‌రాలు,
  - 25 సంవ‌త్స‌రాల పాల‌సీకి 16 సంవ‌త్స‌రాల చొప్పున‌ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

 • పాల‌సీలో చేరేందుకు కావ‌ల‌సిన క‌నీస వ‌య‌సు : 8 సంవ‌త్స‌రాలు(పూర్తై ఉండాలి.)

 • గ‌రిష్ట వ‌య‌సు : 59 సంవ‌త్స‌రాలు(16 సంవ‌త్స‌రాల పాల‌సీకి ), 54 సంవ‌త్స‌రాలు (21 సంవ‌త్స‌రాల పాల‌సీకి), 50 సంవ‌త్స‌రాలు( 25 సంవ‌త్స‌రాల పాల‌సీకి),

 • గ‌రిష్ట మెచ్యూరిటీ వ‌య‌సు :75 సంవ‌త్స‌రాలు.

ప్రీమియం చెల్లింపులు:
ప్రీమియంల‌ను, సంవత్సరానికొకసారి/ఆరు నెలలకు/మూడు నెలలకు/నెలవారీగా(ఈసీఎస్ ద్వారా మాత్ర‌మే) లేదా ఎస్ఎస్ఎస్ మోడ్ ద్వారా గానీ ప్రీమియంను, ప్రీమియం పేయింగ్ ట‌ర్మ్‌లోనే చెల్లించాలి. గ్రేస్ పిరియ‌డ్ ఒక నెల ఉంటుంది. సంవ‌త్స‌రానికి/ ఆరు నెల‌ల‌కు/ త‌్రైమాసికంగా చేసే చెల్లింపుల‌కు 30 రోజుల‌కు త‌క్కువ కాకుండా, నెల‌వారీగా చేసే చెల్లింపుల‌కు 15 రోజుల గ్రేస్ పిరియ‌డ్‌ను అనుమ‌తిస్తారు.

పున‌రుద్ధ‌ర‌ణ‌:
గ్రేస్ పిరియ‌డ్ లోపుగా ప్రీమియంలు చెల్లించ‌క పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది. ర‌ద్ద‌యిన పాల‌సీని, మొద‌టి ప్రీమియం చెల్లించ‌ని రోజు నుంచి రెండు సంవ‌త్స‌రాల లోపుగా పున‌రుద్ద‌రించుకోవాలి. ఇందుకు గానూ అప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియంల‌ను వ‌డ్డీతో స‌హా చెల్లించాలి.

పేయిడప్ వాల్యు:
క‌నీసం మూడు సంవ‌త్స‌రాల పాటు క్ర‌మంత‌ప్ప‌కుండా ప్రీమియంలు చెల్లించి, ఆ త‌రువాత క్ర‌మ ప‌ద్ధ‌తిలో ప్రీమియంలు చెల్లించ‌క‌పోయినప్ప‌టికీ పాల‌సీ పూర్తిగా ర‌ద్దుకాదు. పాల‌సీ మొత్తంపై కొంత పేయిడ్ అప్ విలువను చెల్లిస్తారు.
పేయిడ్‌-అప్ పాల‌సీ హామీ మొత్తం, పాల‌సీ హామీ మొత్తం కంటే త‌క్కువ‌గా ఉంటుంది. దీనిని డెత్‌/ మెచ్యూరిటీ పెయిడ్‌-అప్ స‌మ్ అస్యూర్డ్ అని పిలుస్తారు.

[బీమా(డెత్ / మెచ్యూరిటీపై) హామీ మొత్తం * (చెల్లించిన ప్రీమియంల సంఖ్య / మొత్తం కాల వ్యవధిలో చెల్లించవలసిన ప్రీమియంల సంఖ్య)].
మీరు పాల‌సీని పేయిడ్-అప్ పాల‌సీగా కొన‌సాగితే, భ‌విష్య‌త్తులో లాభాల‌లో పాల్గొనేందుకు అర్హ‌త ఉండ‌దు. రావ‌ల‌సిన బోన‌స్‌లు ఏమైనా ఉంటే, త‌గ్గించిన పేయిడ్‌-అప్ వాల్యూకి జ‌త‌చేసి చెల్లిస్తారు.

పాలసీ సరెండర్ విలువ:
క‌నీసం మూడు సంవ‌త్స‌రాలు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రీమియంల‌ను చెల్లించి, మెచ్యూరిటీ స‌మ‌యం కంటే ముందే పాలసీని సరెండర్ చేస్తే ,పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్నే పాలసీ సరెండర్ విలువ అంటారు. మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంల నుంచి కొంత శాతాన్ని స‌రెండ‌ర్ విలువగా చెల్లిస్తారు. పాల‌సీ కాల‌ప‌రిమితి, పాల‌సీ స‌రెండ‌ర్ చేసిన‌ సంవ‌త్స‌రం ఆధారంగా ప‌ర్సంటేజ్‌ను లెక్కిస్తారు.

పాల‌సీపై రుణం:
ఈ పాల‌సీలో రుణం పొందేందుకు అవ‌కాశం ఉంది. పాలసీకి స‌రెండ‌ర్ విలువ ఉంటే… ఆమొత్తంలో కొంత భాగాన్ని రుణంగా మంజూరు చేస్తారు.

ఫ్రీ-లుక్ పిరియ‌డ్‌:
పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి పాల‌సీతో సంతృప్తి చెంద‌క‌పోతే, పాల‌సీ బాండ్‌ అందిన‌ తేదీ నుంచి 15 రోజుల లోపుగా పాల‌సీని తిరిగి అప్ప‌గించ‌వ‌చ్చు. ఇలా చేస్తే సంస్థ పాల‌సీని ర‌ద్దు చేసి, ప‌న్నులు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు మిన‌హాయించుకుని మిగిలిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

మిన‌హాయింపులు:
ఆత్మ‌హ‌త్య‌: ఈ కింది సంద‌ర్భాల‌లో పాల‌సీ వ‌ర్తించ‌దు.
పాల‌సీ తీసుకున్న 12 నెల‌ల లోపుగా, మాన‌సిక స్థితి స‌రిగా ఉండిగానీ, లేక గానీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డితే హామీ మొత్తం పొంద‌లేరు. పున‌రుద్ధ‌రించిన పాల‌సీలు కూడా ఈ నియ‌మం వ‌ర్తిస్తుంది. అయితే చెల్లించిన ప్రీమియం నుంచి 80 శాతం ప్రీమియంల‌ను తిరిగి చెల్లిస్తారు. ఇత‌ర క్లెయిమ్‌ల‌ను కూడా సంస్థ చెల్లించ‌దు. పేయిడ్ అప్ వాల్యు పొంద‌కుండా ర‌ద్దైన పాల‌సీల‌కు కూడా చెల్లింపులు చెయ్య‌రు.

ఉదాహ‌ర‌ణ‌:
lic1.jpg

jeevan labh2.jpg

సినారియో-1: స‌్థూల పెట్ట‌బ‌డి రాబ‌డి - వార్షికంగా 4 శాతం
సినారియో-2: స‌్థూల పెట్ట‌బ‌డి రాబ‌డి - వార్షికంగా 8 శాతం
*పై ఉదాహ‌ర‌ణ‌లో ప్రీమియంలో ప‌న్నును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.
** ఏప‌రిస్థితులలోనైనా డెత్ బెనిఫిట్, చెల్లించిన ప్రీమియంల‌పై 105 శాతానికి త‌క్కువ కాకుండా చెల్లిస్తారు.
*** మెచ్యూరిటీ మొత్తాన్ని పాల‌సీ ముగిసే సంవ‌త్స‌రం చెల్లిస్తారు. డెత్ బెనిఫిట్‌ను ఏ సంవ‌త్స‌రంలో అయితే క్లెయిమ్ చేస్తారో అదే సంవ‌త్స‌రంలో చెల్లిస్తారు.
****ఒకవేళ పాలసీదారునికి మరింత అనుకూలంగా ఉంటే ప్రత్యేక సరెండర్ విలువ చెల్లించే అవ‌కాశం ఉంటుంది.

lic2.jpg

jeevan labh4.jpg

గుర్తించుకోండి:

 1. పైన తెలిపిన 1,2ఉదాహ‌ర‌ణ‌ల‌లో నాన్‌-గ్యారెంటీ ప్ర‌యోజ‌నాలు లెక్కిస్తే, మీరు పెట్టిన పెట్టుబ‌డుల‌పై రాబ‌డి వార్షికంగా, సినారియో-1 లో 4 శాతం గానూ, రెండ‌వ సినారియోలో 8 శాతంగానూ ఉంది. మరో మాటలో చెప్పాలంటే, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డుల‌పై 4 శాతం నుంచి 8 శాతం రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది అంచ‌నా రేటు మాత్ర‌మే, ఖ‌చ్చితంగా ఇంత రాబ‌డి వ‌స్తుంద‌ని చెప్ప‌లేము.

 2. పైన ఉదాహ‌ర‌ణ‌లు చెప్ప‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణం పాల‌సీ తీసుకునే వ్య‌క్తి తాము తీసుకునే వివిధ ప‌రిస్థితిల‌లో పాల‌సీ ఫీచ‌ర్ల‌ను, పాల‌సీ అందించే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుంటే స‌రైన ప్రాడెక్టును ఎంచుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

చివ‌రిగా

 • జీవిత బీమా అనేది దీర్ఘ‌కాలం కోసం చేసుకునే ఒప్పందం.

 • ఎండోమెంట్ పాల‌సీలు బీమా, పెట్టుబ‌డుల క‌ల‌యిక‌తో వ‌స్తాయి.

 • వీటిలో ప్రీమియం అధికంగానూ, హామీ మొత్తం త‌క్కువ‌గానూ ఉంటుంది. రాబ‌డి కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.

 • రాబ‌డి దాదాపు 5 నుంచి 5.5 శాతం వ‌ర‌కు ఉంటుంది.

 • వీటితో త‌గినంత బీమా కానీ, రిక‌రింగ్ డిపాజిట్ల నుంచి వ‌చ్చే విధంగా స‌రైన రాబ‌డి గానీ ఉండ‌దు. అందువ‌ల్ల ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవ‌డం మంచిది.

 • ట‌ర్మ్ పాల‌సీలో ప్రీమియం త‌క్కువ‌గానూ, హామీ మొత్తం అధికంగానూ ఉంటుంది. అయితే పాల‌సీ దారుడు పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి చివ‌రి వ‌ర‌కు జీవించి వుంటే ఎలాంటి హామీ చెల్లింపులు ఉండ‌వు.

 • దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల కోసం పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల వంటి వాటిని ఎంచుకోవ‌చ్చు.

 • మీరు తీసుకున్న ఎండోమెంట్ పాల‌సీ కాల‌ప‌రిమితి స‌మీపిస్తున్న‌, లేదా పాల‌సీ అందించే రాబడుల‌తో సంతృప్తి చెందితే పాల‌సీని కొన‌సాగించ‌వ‌చ్చు.

 • అయితే జీవిత బీమా కోసం ఒక ట‌ర్మ్ పాల‌సీని కూడా తీసుకోవ‌డం మంచిది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని