భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in Green
close

Published : 09/03/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50,714 వద్ద, నిఫ్టీ 15,049 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:42 గంటల సమయానికి సెన్సెక్స్‌ 423 పాయింట్లు ఎగబాకి 50,864 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 15,084 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.17 వద్ద కొనసాగుతోంది.

ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సోమవారం ఇంట్రాడేలో గరిష్ఠాన్ని తాకిన అమెరికా సూచీలు టెక్‌ షేర్ల అమ్మకాలతో నష్టాల్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఫిబ్రవరి 12నాటి జీవితకాల గరిష్ఠాల నుంచి అక్కడి సూచీలు 10.6 శాతం వెనక్కి తగ్గాయి. మరోవైపు చమురు ధరలు సోమవారం కాస్త చల్లబడ్డాయి. ఈ పరిణామాలు నేడు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌ మినహా నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. భారత్‌ పెట్రోలియం, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, ఐవోసీఎల్ ‌షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని