
తాజా వార్తలు
న్యూదిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ముడిసరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘‘ముడిసరకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకోసమే జనవరి 2020 నుంచి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నాము’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ఏ మోడళ్లపై ధరలు పెరగనున్నాయో మాత్రం ఈ ప్రకటనలో వెల్లడించలేదు.
ఈ కంపెనీ తయారు చేసే ఆల్టో, ఎస్-ప్రెస్సో, వేగనార్, స్విఫ్ట్, సెలిరియో, డిజైర్, సియాజ్ దేశీయ విక్రయాలు గతవారం 3.2శాతం తగ్గాయి. కంపెనీ 1,41,400 వాహనాలను స్థానిక డీలర్లకు అందజేసింది. దీనికి అదనంగా టయోటాతో కలిసి గ్లాన్జా మోడల్‌కు చెందిన 2286 వాహనాలను విక్రయించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
