జోరుగా ఆరంభమై.. స్తబ్దుగా ముగిసి.. - Sensex down by 31 pts
close

Updated : 16/03/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జోరుగా ఆరంభమై.. స్తబ్దుగా ముగిసి..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేసిన సూచీలు నెమ్మదిగా కిందకు దిగజారాయి. మధ్యాహ్నం 1:30 తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. ఉదయం 50,608 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,857 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత 50,289 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 31 పాయింట్లు నష్టపోయి 50,363 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,996 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,051 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 14,890 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 19 పాయింట్లు నష్టపోయి 14,910 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.58 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా సూచీలు దాదాపు అన్నీ లాభాల్లో ముగిశాయి. దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లోకి జారుకోవడమే నేడు సూచీలను దెబ్బతీసింది. 

బ్యాంకింగ్, ఆర్థికం, లోహ, స్థిరాస్తి రంగాల సూచీలు నష్టాల్లో... ఐటీ, టెక్‌, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ షేర్లు లాభాలను ఆర్జించగా.. టాటా స్టీల్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ, భారత్‌ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని